Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి ప్రయోగం

అక్కినేని, ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలు గుర్తున్నాయా? అందులో ఓ పాట స్టార్ట్ అయితే కనీసం 10 నిమిషాలుండేది. ఓ పద్యం మొదలుపెడితే అలా సాగిపోయేది. ఇప్పుడీ ట్రెండ్ ను రాజమౌళి ఫాలో అవ్వబోతున్నాడు. అవును.. ఆర్ఆర్ఆర్ కోసం అతిపెద్ద సాంగ్ ను కంపోజ్ చేయించాడు జక్కన్న. కీరవాణి ఈ పాటకు స్వరకల్పన చేశారు. సాధారణంగా పాటలు 4 నుంచి 5 నిమిషాలుంటాయి. కానీ ఈ పాట మాత్రం 10 నిమిషాలకు పైగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పుడీ […]

ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి ప్రయోగం
X

అక్కినేని, ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలు గుర్తున్నాయా? అందులో ఓ పాట స్టార్ట్ అయితే కనీసం 10 నిమిషాలుండేది. ఓ పద్యం మొదలుపెడితే అలా సాగిపోయేది. ఇప్పుడీ ట్రెండ్ ను రాజమౌళి ఫాలో అవ్వబోతున్నాడు. అవును.. ఆర్ఆర్ఆర్ కోసం అతిపెద్ద సాంగ్ ను కంపోజ్ చేయించాడు జక్కన్న. కీరవాణి ఈ పాటకు స్వరకల్పన చేశారు.

సాధారణంగా పాటలు 4 నుంచి 5 నిమిషాలుంటాయి. కానీ ఈ పాట మాత్రం 10 నిమిషాలకు పైగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పుడీ పాట షూటింగ్ ను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు రాజమౌళి. ఈ పాటకున్న మరో స్పెషాలిటీ ఏంటంటే… ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సాంగ్ ఇది. సినిమాలో అత్యంత కీలకమైన పాట అంట.

ఈ పాటలో లొకేషన్స్ కంటే గ్రాఫిక్స్ ఎక్కువగా కనిపిస్తాయట. అందుకే హీరోలిద్దరిపై 20 రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ ఒక్క పాట కోసమే 30 రోజుల పాటు గ్రాఫిక్ వర్క్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాజమౌళి యూనిట్ స్టోరీబోర్డ్ రెడీ చేసింది. ఇలా చెప్పుకుంటూపోతే ఆర్ఆర్ఆర్ లో చాలా మెరుపులు ఉన్నాయంటోంది టీమ్

First Published:  19 Jun 2021 8:45 AM GMT
Next Story