Telugu Global
Health & Life Style

కోవిడ్ వ్యాక్సిన్ తో లైంగిక సామర్థ్యం పెరుగుతుందా..?

కోవిడ్ వ్యాక్సిన్ తో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని గతంలో వెలువడిన పలు నివేదికలు ఆందోళన కలిగించాయి. ఓ దశలో అమెరికా యువత కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోకుండా వెనకాడ్డానికి ఇదే అసలు కారణం అని తెేలింది. అయితే ఈ విషయంపై జరిపిన విస్తృత పరిశోధనల్లో వ్యాక్సిన్లతో లైంగిక సామర్థ్యం తగ్గే ప్రశ్నే లేదని చెప్పారు మియామీ యూనివర్శిటీ నిపుణులు. పైగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వీర్యం పరిమాణం స్వల్పంగా పెరగడంతోపాటు, వీర్య కణాల కదలిక కూడా చురుగ్గా ఉన్నట్టు […]

కోవిడ్ వ్యాక్సిన్ తో లైంగిక సామర్థ్యం పెరుగుతుందా..?
X

కోవిడ్ వ్యాక్సిన్ తో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని గతంలో వెలువడిన పలు నివేదికలు ఆందోళన కలిగించాయి. ఓ దశలో అమెరికా యువత కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోకుండా వెనకాడ్డానికి ఇదే అసలు కారణం అని తెేలింది. అయితే ఈ విషయంపై జరిపిన విస్తృత పరిశోధనల్లో వ్యాక్సిన్లతో లైంగిక సామర్థ్యం తగ్గే ప్రశ్నే లేదని చెప్పారు మియామీ యూనివర్శిటీ నిపుణులు. పైగా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వీర్యం పరిమాణం స్వల్పంగా పెరగడంతోపాటు, వీర్య కణాల కదలిక కూడా చురుగ్గా ఉన్నట్టు చెప్పారు.

మెసెంజర్ ఆర్.ఎన్.ఎ.. m(RNA) పై జరిపిన పరిశోధనల ద్వారా ఈ ఫలితాలు వెల్లడించారు మియామీ శాస్త్రవేత్తలు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 45మంది వలంటీర్లపై వీరు పరిశోధనలు జరిపారు. టీకాలు ఇవ్వక ముందు వీరి స్పెర్మ్ క్వాంటిటీ, స్పెర్మ్ కౌంట్ ని పరీక్షించారు. ఆ తర్వాత వీరికి ఫైజర్‌, మోడెర్నా కంపెనీ టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ వీర్య కణాలను పరిశీలించారు. వ్యాక్సిన్‌తో సెక్స్‌ సామర్థ్యం తగ్గిపోవడం, వీర్యకణాలు తగ్గడం లాంటి ప్రచారాలను కల్పితాలని తేల్చారు. అమెరిక‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ జ‌ర్నల్‌ ‘జామా’లో ఈ నివేదిక‌ వివరాల్ని ప్రచురించారు.

టీకాలు తీసుకున్న వ్యక్తుల వీర్యక‌ణాల్లో బేస్‌ లైన్ స్పెర్మ్ కాన్సన్ట్రేషన్, టోట‌ల్ మొబైల్ స్పెర్మ్ కౌంట్.. 26మిలియ‌న్లు/ఎంఎల్‌, టోటల్ కౌంట్ 36 మిలియ‌న్లు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. టీకా రెండో డోసు తీసుకున్న తర్వాత వారిలో వీర్యక‌ణాల సంఖ్య 30 మిలియ‌న్లు/ఎంఎల్, టోట‌ల్ కౌంట్ 44 మిలియ‌న్లకు పెరిగింది. టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో సిమెన్ వాల్యూమ్‌ తో పాటు స్పెర్మ్ మొటిలిటీ కూడా గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్లు ప‌రిశోధ‌కులు చెప్పారు.

కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టక ముందునుంచీ ఈ ప్రచారం ఉంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో లైంగిక సామర్థ్యం తగ్గుతోందని చైనా ఓ నివేదిక ప్రచురించింది. ఆ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్నవారిలో కూడా ఇవే లక్షణాలు కనిపించాయనే ప్రచారం కూడా ఊపందుకుంది. దీంతో అమెరికాలో చాలామంది వ్యాక్సినేషన్ కి వెనకడుగేశారు. తాజా అధ్యయనంలో అలాంటివన్నీ అవాస్తవాలని తేలింది. కోవిడ్ వ్యాక్సిన్ తో లైంగిక సామర్థ్యం తగ్గదని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

First Published:  18 Jun 2021 11:09 PM GMT
Next Story