Telugu Global
National

స్విస్​ బ్యాంక్​లో మనోళ్లు గట్టిగానే దాచుకున్నారే..!

మనదేశానికి చెందిన చాలా మంది వ్యాపారవేత్తలకు స్విస్​ బ్యాంకులో అకౌంట్​ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆదాయపన్ను శాఖ కళ్లు గప్పి.. చాలా మందినేతలు ఈ బ్యాంకులో డబ్బు దాచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా స్విస్​ బ్యాంక్​ ఓ జాబితాను విడుదల చేసింది. భారతీయులు తమ బ్యాంకులో ఎంత నగదు దాచుకున్నారో ఈ నివేదిక బయటపెట్టింది. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. స్విస్​ బ్యాంక్​లో దాచుకున్న భారతీయులు డబ్బు గణనీయంగా పెరిగింది. మనదేశానికి చెందిన వ్యాపార వేత్తలు మొత్తం […]

స్విస్​ బ్యాంక్​లో మనోళ్లు గట్టిగానే దాచుకున్నారే..!
X

మనదేశానికి చెందిన చాలా మంది వ్యాపారవేత్తలకు స్విస్​ బ్యాంకులో అకౌంట్​ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆదాయపన్ను శాఖ కళ్లు గప్పి.. చాలా మందినేతలు ఈ బ్యాంకులో డబ్బు దాచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా స్విస్​ బ్యాంక్​ ఓ జాబితాను విడుదల చేసింది. భారతీయులు తమ బ్యాంకులో ఎంత నగదు దాచుకున్నారో ఈ నివేదిక బయటపెట్టింది. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. స్విస్​ బ్యాంక్​లో దాచుకున్న భారతీయులు డబ్బు గణనీయంగా పెరిగింది. మనదేశానికి చెందిన వ్యాపార వేత్తలు మొత్తం రూ. 20,700 కోట్ల నగదును స్విస్​ బ్యాంకులో దాచుకున్నారు.

2020 సంవత్సరం వరకు భారతీయులు ఎంత మొత్తం దాచుకున్నారో స్విస్​ బ్యాంక్​ వెల్లడించింది.
2019 సంవత్సరం వరకు భారతీయులు దాచుకున్న నగదు రూ. 6,625 కోట్లుగా ఉండగా.. ఈ మొత్తం ఈ ఏడాది నాటికి గణనీయంగా పెరిగింది. బాండ్స్, ఇతర పథకాల్లో డిపాజిట్ చేసిన మొత్తం భారీగా పెరగడమే ఇందుకు కారణమని సమాచారం.

అన్ని స్విస్ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020 సంవత్సరంలో దాదాపు రెండు ల‌క్ష‌ల కోట్ల స్విస్ ఫ్రాంక్స్‌కు చేరుకున్నాయి. ఇందులో విదేశీ ఖాతాదారుల డిపాజిట్లు 600 బిలియన్ డాలర్లు. ఇక.. 377 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లతో బ్రిటన్ అగ్రస్థానంలో, 152 బిలియన్ డాలర్లతో అమెరికా రెండో స్థానంలో నిలిచాయి.

వంద బిలియన్ ఫ్రాంక్స్‌‌లకు పైగా ఉన్న దేశాలు ఈ రెండు మాత్రమే. ఇక.. 2006 లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారత కంపెనీల నిధులు 6.5 బిలియన్ డాలర్లు కాగా, 2011, 2013, 2017 సహా మరికొన్ని సంవత్సరాలను మినహాయిస్తే మిగిలిన సంవత్సరాల్లో ఈ పరిమాణాలు కొంతమేర తగ్గాయి. ఇక.. నిరుడు(2020 లో) కస్టమర్ అకౌంట్ డిపాజిట్ 503.9 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ లేదా రూ. 4 వేల కోట్లు. ముందటేడు(2019 లో) ఈ మొత్తం 550 మిలియన్ ఫ్రాంక్‌లు.

First Published:  19 Jun 2021 1:55 AM GMT
Next Story