Telugu Global
NEWS

ఇంటర్ పరీక్షలపై క్లారిటీ.. ఎంసెట్ డేట్లు కూడా వచ్చేశాయ్..

ఏపీలో పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభనపై ఓ క్లారిటీ వచ్చింది. కరోనా కేసులు తగ్గుతున్న ఈ దశలో లాక్ డౌన్ నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో సడలిస్తున్నారు. అయితే పరీక్షల డేట్లు మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈలోగా ఎంసెట్ పేరు మార్చి, తేదీలు కూడా ప్రకటించడంతో ఇంటర్ పరీక్షలపై ఓ క్లారిటీ వచ్చినట్టయింది. ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAMCET) పేరుతో ఉమ్మడి ఏపీలో ఎంసెట్ ని నిర్వహించేవారు. అయితే ఇటీవల […]

ఇంటర్ పరీక్షలపై క్లారిటీ.. ఎంసెట్ డేట్లు కూడా వచ్చేశాయ్..
X

ఏపీలో పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభనపై ఓ క్లారిటీ వచ్చింది. కరోనా కేసులు తగ్గుతున్న ఈ దశలో లాక్ డౌన్ నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో సడలిస్తున్నారు. అయితే పరీక్షల డేట్లు మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈలోగా ఎంసెట్ పేరు మార్చి, తేదీలు కూడా ప్రకటించడంతో ఇంటర్ పరీక్షలపై ఓ క్లారిటీ వచ్చినట్టయింది.

ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EAMCET) పేరుతో ఉమ్మడి ఏపీలో ఎంసెట్ ని నిర్వహించేవారు. అయితే ఇటీవల మెడికల్ సీట్లకోసం జాతీయ స్థాయిలో నీట్ నిర్వహిస్తున్నారు. దీంతో ఎంసెట్ లో మెడికల్ కి స్థానం లేదు. అందుకే ఈ ఏడాది ఎంసెట్ పేరు మార్చేశారు. ఏపీలో ఎంసెట్ కి బదులుగా ఇకపై ఈఏపీసెట్ (EAPCET) నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మ‌సీ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్టుగా ఈఏపీ సెట్ ను నిర్వ‌హించ‌బోతున్నారు. దీనికి సంబంధించి ఈనెల 24న నోటిఫికేష‌న్ విడుదల చేస్తామని, 26 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌రణ ఉంటుంద‌ని వివ‌రించారు. జులై 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తామని చెప్పారాయన. ఆగ‌స్టు 19 నుంచి 25 వ‌ర‌కు పరీక్షలు నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపింది.

ఈఏపీసెట్ రాయడానికి ప్రధాన అర్హత ఇంటర్ పాస్ కావడం. ఇంటర్ పరీక్షలు రాసి, ఫలితాలకోసం వేచి చూస్తున్నవారు కూడా ఎంట్రన్స్ రాయొచ్చు. అంటే.. ఏపీలో ఇంటర్ పరీక్షలు పెట్టేందుకు ప్రభుత్వం పరోక్షంగా సుముఖంగానే ఉన్నట్టు ఈ ప్రతిపాదనతో తేలిపోయింది. జులైలో పది, ఇంటర్ పరీక్షలు పూర్తిచేసేందుకు ఈపాటికే విద్యాశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అకడమిక్ పరీక్షల తర్వాత ఆగస్ట్ లో ఈఏపీసెట్ నిర్వహిస్తారు. ఒకవేళ పరీక్షలకు ప్రభుత్వం సుముఖంగా లేకపోయినా.. ఆ నిర్ణయం అతి త్వరలోనే తెలియజేస్తారని తేలిపోయింది.

First Published:  19 Jun 2021 4:39 AM GMT
Next Story