Telugu Global
National

ముంబైలో వ్యాక్సినేషన్ స్కామ్..

ముంబైలో బయటపడ్డ వ్యాక్సినేషన్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల పేరుతో పెడుతున్న వ్యాక్సినేషన్ క్యాంప్ లపై పలు అనుమానాలు లేవనెత్తుతోంది. ముంబైలో ఇటీవల కాలంలో ప్రైవేటు వ్యాక్సినేషన్ క్యాంప్ లు బాగా జరిగాయి. అపార్ట్ మెంట్లు, రెసిడెన్షియల్ కాలనీల అసోసియేషన్లు ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించి నేరుగా ఆయా ప్రాంతాల్లో వ్యాక్సిన్ డ్రైవ్ లు ఏర్పాటు చేసేవి. ముంబైలో పలు ప్రైవేటు కార్యాలయాలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సంస్థలు కూడా ఇలా తమ సిబ్బందికి సామూహిక […]

ముంబైలో వ్యాక్సినేషన్ స్కామ్..
X

ముంబైలో బయటపడ్డ వ్యాక్సినేషన్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల పేరుతో పెడుతున్న వ్యాక్సినేషన్ క్యాంప్ లపై పలు అనుమానాలు లేవనెత్తుతోంది. ముంబైలో ఇటీవల కాలంలో ప్రైవేటు వ్యాక్సినేషన్ క్యాంప్ లు బాగా జరిగాయి. అపార్ట్ మెంట్లు, రెసిడెన్షియల్ కాలనీల అసోసియేషన్లు ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించి నేరుగా ఆయా ప్రాంతాల్లో వ్యాక్సిన్ డ్రైవ్ లు ఏర్పాటు చేసేవి. ముంబైలో పలు ప్రైవేటు కార్యాలయాలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సంస్థలు కూడా ఇలా తమ సిబ్బందికి సామూహిక వ్యాక్సిన్ కార్యక్రమాలను చేపట్టాయి. అయితే వీరంతా ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించే క్రమంలో మధ్యలో ఏజెన్సీలు తెరపైకి వచ్చాయి. ఈ ఏజెన్సీలు ప్రైవేటు ఆస్పత్రుల తరపున ఆయా ప్రాంతాలకు వచ్చి వ్యాక్సినేషన్ డ్రైవ్ లు పెట్టేవి. అయితే రోజులు గడుస్తున్నా.. టీకా వేయించుకున్నవారికి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, కొవిన్ యాప్ లో టీకా వేయించుకున్నవారి పేర్లు లేకపోవడంతో.. గందరగోళం నెలకొంది. చివరకు సదరు ఏజెన్సీలు తమని మోసం చేసినట్టు గ్రహించాయి వెల్ఫేర్ కమిటీలు, కంపెనీలు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.

ముంబై కందివాలి లోని హరినందని హెరిటేజ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మే 30న తమ అపార్ట్ మెంట్ వాసులందరికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ పెట్టింది. అయితే ఇప్పటి వరకూ వారెవరికీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. కనీసం కొవిన్ యాప్ లో కూడా వారి వివరాలు లేవు. దీంతో మోసపోయామని గ్రహించిన అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ తమ వద్ద పనిచేసే 350మంది ఉద్యోగులకు ఇలాగే టీకా డ్రైవ్ చేపట్టింది. ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుని అందరికీ ఒకేరోజు టీకా వేయించింది. ఇందుకుగాను ఒక్కో డోసుకి రూ.1250 ప్లస్ జీఎస్టీ వసూలు చేశారు నిర్వాహకులు. మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ అనే సంస్థ కూడా 150మంది సిబ్బందికి ఇలాగే వ్యాక్సిన్లు వేయించింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించి కంపెనీలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించింది ఒకే వ్యక్తి కావడం గమనార్హం. ఎస్పీ ఈవెంట్స్ సంస్థ ప్రతినిధి సంజయ్ గుప్తా, పలు ప్రైవేటు ఆస్పత్రుల పేర్లు చెప్పి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అతను అడ్రస్ లేకుండా పారిపోయాడు.

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారంటే అసలు తమకు వేసింది వ్యాక్సినా లేక సెలైన వాటరా అని ప్రశ్నిస్తున్నారు బాధితుల. నిర్వాహకులు సర్టిఫికెట్లు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారంటే కచ్చితంగా టీకా పేరుతో మోసం జరిగిందని అనుమానిస్తున్నారు. రోజు రోజుకీ ఈ తరహా కేసులు ముంబైలో ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని కంపెనీలు ఇలా మోసగాళ్ల బారినపడ్డాయి. మరోవైపు ఫేక్ వ్యాక్సిన్ తో ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయేమోనని టీకా తీసుకున్నవారిలో ఆందోళన మొదలైంది. మొత్తమ్మీద ఇప్పుడీ ఫేక్ వ్యాక్సినేషన్ వ్యవహారం ముంబైతోపాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

First Published:  17 Jun 2021 8:13 PM GMT
Next Story