Telugu Global
Family

పిల్లల కోసం మోడెర్నా..

ప్రోటీన్ ఆధారిత టీకా అయిన మోడెర్నా.. పిల్లలకు రక్షణ కల్పించే టీకాగా పనికొస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. సైన్స్​ ఇమ్యునాలజీ పత్రికలో ప్రచురించిన కథనంలో కోతి పిల్లలపై చేసిన ప్రయోగంలో యాంటీబాడీలు ప్రతిస్పందిస్తున్నట్లు నిర్దరణ అయినట్లు పేర్కొన్నారు. పిల్లల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి టీకాలు ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 16 కోతి పిల్లలపై 22 వారాలపాటు జరిగిన ప్రయోగాల్లో మోడెర్నా వ్యాక్సిన్ సరైన ఫలితాలను ఇచ్చాయని , అయితే మరిన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ఏడాది పాటు […]

పిల్లల కోసం మోడెర్నా..
X

ప్రోటీన్ ఆధారిత టీకా అయిన మోడెర్నా.. పిల్లలకు రక్షణ కల్పించే టీకాగా పనికొస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. సైన్స్​ ఇమ్యునాలజీ పత్రికలో ప్రచురించిన కథనంలో కోతి పిల్లలపై చేసిన ప్రయోగంలో యాంటీబాడీలు ప్రతిస్పందిస్తున్నట్లు నిర్దరణ అయినట్లు పేర్కొన్నారు.

పిల్లల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి టీకాలు ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 16 కోతి పిల్లలపై 22 వారాలపాటు జరిగిన ప్రయోగాల్లో మోడెర్నా వ్యాక్సిన్ సరైన ఫలితాలను ఇచ్చాయని , అయితే మరిన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ఏడాది పాటు ప్రయోగాలు కొనసాగించాలని తెలిపారు. రెండున్నర నెలల వయసున్న కోతి పిల్లలను రెండు గ్రూపులుగా విడదీసి.. టీకాలను ఇవ్వగా.. నాలుగు వారాల తర్వాత వాటిలో రోగనిరోధక శక్తి పెరిగినట్లు పరిశోధకులు తెలిపారు. ప్రీక్లినికల్​​ మోడెర్నా ఎం ఆర్ఎన్ఏ టీకా లేదా అమెరికాకు చెందిన ఎన్​ఐఏఐడీ రూపొందించిన ప్రోటీన్ ఆధారిత వ్యాక్సిన్ అందించగా.. ఆ రెండు వ్యాక్సిన్లు ఇమ్యునోగ్లోబులిన్ జీని తటస్థీకరించి, కరోనా, స్పైక్ ప్రోటీన్-నిర్దిష్ట టీ కణాలకు వ్యతిరేకంగా యాంటీబాడీలు వృద్ధి చేసాయి. ఇది పిల్లల్లో వైరస్ నుంచి భద్రత కల్పించేందుకు తోడ్పడుతుంది. అయితే పెద్దలకు ఇచ్చే 100 మైక్రోగ్రామ్ డోసుకు బదులుగా.. 30 మైక్రోగ్రాముల డోసు పిల్లలకు ఇస్తే సరిపోతుంది అని పరిశోధకులు చెప్తున్నారు. సురక్షితమైన, సమర్థమైన టీకాలు.. పిల్లల్లో కరోనా వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడతాయని ఇంకా వీటిపై పరిశోధనలు జరగాల్సి ఉందని వారు చెప్తున్నారు.

First Published:  17 Jun 2021 5:55 AM GMT
Next Story