Telugu Global
National

డెల్టా ప్లస్ కి థర్డ్ వేవ్ కి సంబంధం ఉందా..?

కరోనా సెకండ్ వేవ్ విజృంభించడానికి కారణం భారత్ లో బయటపడ్డ డెల్టా వేరియంట్ అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. కరోనా వైరస్ లో వచ్చిన ఈ కొత్త మ్యుటెంట్ వల్ల భారత్ లో సెకండ్ వేవ్ విజృంభించింది. ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించింది. తొలి దశ కరోనాని జయించామని చంకలు గుద్దుకున్న ప్రభుత్వాధినేతలు, సెకండ్ వేవ్ సమయంలో కనీసం నోరు తెరవకపోవడానికి కూడా సాహసం చేయలేదంటే దానికి కారణం డెల్టా వేరియంటే. ప్రస్తుతం బ్రిటన్ లో దీని ప్రభావం […]

డెల్టా ప్లస్ కి థర్డ్ వేవ్ కి సంబంధం ఉందా..?
X

కరోనా సెకండ్ వేవ్ విజృంభించడానికి కారణం భారత్ లో బయటపడ్డ డెల్టా వేరియంట్ అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. కరోనా వైరస్ లో వచ్చిన ఈ కొత్త మ్యుటెంట్ వల్ల భారత్ లో సెకండ్ వేవ్ విజృంభించింది. ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించింది. తొలి దశ కరోనాని జయించామని చంకలు గుద్దుకున్న ప్రభుత్వాధినేతలు, సెకండ్ వేవ్ సమయంలో కనీసం నోరు తెరవకపోవడానికి కూడా సాహసం చేయలేదంటే దానికి కారణం డెల్టా వేరియంటే. ప్రస్తుతం బ్రిటన్ లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో డెల్టా వేరియంట్ ప్రభావం కూడా తగ్గుతున్నట్టే భావించాలి. అయితే ఇప్పుడు వచ్చిన మరో ఉత్పరివర్తనం ‘డెల్టా’ ప్లస్ వేరియంట్ కరోనా థర్డ్ వేవ్ ముప్పుకి సంకేతంలా మారింది. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా ప్లస్ ఉనికి తెలుస్తోంది. భారత్ లో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. ఒకవేళ థర్డ్ వేవ్ మొదలైతే.. దానికి కారణం డెల్టా ప్లస్ వేరియంటే అవుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్ చికిత్సలో ఉపయోగిస్తున్న మందులు, వ్యాక్సిన్.. డెల్టా ప్లస్ ని ఎలా ఎదుర్కుంటున్నాయనే విషయంపై పరిశోధనలు సాగుతున్నాయి.

మహారాష్ట్రలో హై అలర్ట్..
కరోనా సెకండ్ వేవ్ ముందుగా మహారాష్ట్రను అతలాకుతలం చేసింది. థర్డ్ వేవ్ వార్తల నేపథ్యంలో ఆ రాష్ట్రం మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌తో థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే సెకండ్‌ వేవ్‌ కు రెట్టింపు సంఖ్యలో కేసులు వస్తాయని మహరాష్ట్ర కొవిడ్‌-19 టాస్క్‌ ఫోర్స్‌, వైద్య నిపుణుల బృందం హెచ్చరించింది. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రేకి నిపుణుల బృందం నివేదికలు సమర్పించింది. ఆ లోగా వ్యాక్సిన్‌ పంపిణీ వేగవంతం చేయాలని వారు సూచించారు.

వైద్య నిపుణుల హెచ్చరికలతో మహారాష్ట్రలో థర్డ్ వేవ్ అలర్ట్ ప్రకటించారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. అన్ని ప్రాంతాల్లో ఔషధాలు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఫస్ట్ వేవ్ సమయంలో తగినన్ని సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డామని చెప్పిన ఆయన, తర్వాత ఆ లోపాలను సవరించుకొని సెకండ్‌ వేవ్‌ ను ఎదుర్కొంటున్నామని అన్నారు. రెండు, మూడు నెలల్లో వ్యాక్సిన్‌ కొరతను కూడా అధిగమిస్తామని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజలకు హామీ ఇచ్చారు.

ప్రస్తుతం మహారాష్ట్రలోని క్రియాశీల కేసుల్లో 10 శాతం మంది చిన్నారులే. కరోనా ఫస్ట్‌ వేవ్ సమయంలో 19 లక్షల మందికి వైరస్‌ సోకగా, సెకండ్‌ వేవ్‌లో ఆ సంఖ్య 40 లక్షలకు చేరింది. మహారాష్ట్రలో మరణాల రేటు కూడా గణనీయంగా పెరిగింది.

First Published:  17 Jun 2021 6:39 AM GMT
Next Story