Telugu Global
CRIME

ఆక్సిమీటర్ యాప్స్ తో జాగ్రత్త!

ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేస్తామని చెప్పే యాప్స్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు టెక్ నిపుణులు. ఆక్సిమీటర్ యాప్ ల పేరుతో కొన్ని నకిలీ యాప్ లు యూజర్ల పర్సనల్ డేటాను దొంగిలించే ప్రమాదముందని హెచ్చరిస్తూ.. తమిళనాడు పోలీసులు మంగళవారం సోషల్ మీడియా ద్వారా సలహా ఇచ్చారు.డం ముగుస్తుంది! ఫింగర్ ప్రింట్ సెన్సార్లను ఉపయోగించి రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పరీక్షిస్తామని చెప్పే కొన్ని నకిలీ యాప్ లు యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మొబైల్ లో రకరకాల […]

ఆక్సిమీటర్ యాప్స్ తో జాగ్రత్త!
X

ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేస్తామని చెప్పే యాప్స్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు టెక్ నిపుణులు. ఆక్సిమీటర్ యాప్ ల పేరుతో కొన్ని నకిలీ యాప్ లు యూజర్ల పర్సనల్ డేటాను దొంగిలించే ప్రమాదముందని హెచ్చరిస్తూ.. తమిళనాడు పోలీసులు మంగళవారం సోషల్ మీడియా ద్వారా సలహా ఇచ్చారు.డం ముగుస్తుంది!

ఫింగర్ ప్రింట్ సెన్సార్లను ఉపయోగించి రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పరీక్షిస్తామని చెప్పే కొన్ని నకిలీ యాప్ లు యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మొబైల్ లో రకరకాల పర్మిషన్లు అడుగుతాయి. వాటన్నింటికీ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఆ యాక్సెస్ ను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఒకసారి యాప్ కు అన్ని పర్మిషన్లు ఇచ్చాక అవి మన ఇన్‌బాక్స్ లో మెసేజ్ లు కూడా చదవగలవు. అంటే బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్ లు, ఓటీపీలను కూడా అవి రీడ్ చేయగలవు. దీని వల్ల యూజర్లకు ఎంతో ప్రమాదముండే అవకాశం ఉంది.

తమిళనాడుతో సహా మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాలు గతంలో ఇలాంటి మోసాల గురించి ప్రజలను హెచ్చరించాయి. పోలీసుల సలహా ప్రకారం, రక్త ఆక్సిజన్ స్థాయిలను ఖచ్చితంగా కొలవడానికి SpO2 రక్త ఆక్సిజన్ సెన్సార్ అవసరం. ఇది మన స్మార్ట్‌ఫోన్‌లలో ఉండదు.

ఈ యాప్స్ ఆక్సిజన్ లెవల్స్ ట్రాక్ చేయడం కోసం ఫింగర్ ప్రింట్ ను అడుగుతాయి.ఫోన్‌లోని ఫింగర్ ప్రింట్ స్కానర్‌ లేదా కెమెరా ద్వారా ఇవి మీ బయోమెట్రిక్ సమాచారాన్ని కూడా దొంగిలించవచ్చు. ఇలా దొంగిలించిన బయోమెట్రిక్ డేటాను మోసగాళ్ళు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS) ట్రాన్సాక్షన్స్ కోసం ఉపయోగించొచ్చు.

అయితే ఆక్సిమీటర్ లా పని చేసే ఒకట్రెండు నిజమైన యాప్ లు కూడా ఉన్నాయి. కేర్ ప్లిక్స్ విటల్స్ యాప్ అలాంటిదే. ఒరిజినల్ యాప్ అయితే అవి క్లినికల్లీ టెస్టెడ్ అన్న సర్టిఫికేట్ ను పొంది ఉంటాయి. అందుకే యాప్ ఇన్ స్టాల్ చేసే ముందు అది క్లినికల్లీ అప్రూవ్ అయిందో లేదా తెలుసుకుని ఇన్ స్టాల్ చేయాలి. ప్లే స్టోర్ లో ఆక్సిమీటర్ లో పేరుతో అందుబాటులో ఉన్న చాలా యాప్ లు నకిలీవే. సో అలాంటి వాటితో కాస్త జాగ్రత్త.

First Published:  16 Jun 2021 2:39 AM GMT
Next Story