Telugu Global
Cinema & Entertainment

వకీల్ సాబ్ మరోసారి వస్తున్నాడు

ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజైంది వకీల్ సాబ్. అప్పటివరకు క్యూ కడుతూ వచ్చిన సినిమాలు, పవన్ సినిమా రాకతో ఒక్కసారిగా ఆగిపోయాయి. అలా పవన్ కు సోలో రిలీజ్ దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80శాతం థియేటర్లలో వకీల్ సాబే నడిచింది. ఇంత పక్కాగా రిలీజ్ చేసినప్పటికీ నిర్మాత దిల్ రాజుకు ఫలితం దక్కలేదు. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. ఓవైపు కలెక్షన్ల వివరాలను దాచేసి, మరోవైపు సినిమాను లేపేందుకు చాలా ప్రయత్నం చేసింది దిల్ రాజు […]

Vakeel Saab Re-Release | పవన్ సినిమా రీ-రిలీజ్
X

ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజైంది వకీల్ సాబ్. అప్పటివరకు క్యూ కడుతూ వచ్చిన సినిమాలు, పవన్ సినిమా
రాకతో ఒక్కసారిగా ఆగిపోయాయి. అలా పవన్ కు సోలో రిలీజ్ దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80శాతం థియేటర్లలో వకీల్ సాబే నడిచింది. ఇంత పక్కాగా రిలీజ్ చేసినప్పటికీ నిర్మాత దిల్ రాజుకు ఫలితం దక్కలేదు. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు.

ఓవైపు కలెక్షన్ల వివరాలను దాచేసి, మరోవైపు సినిమాను లేపేందుకు చాలా ప్రయత్నం చేసింది దిల్ రాజు
యూనిట్. అయితే అదే టైమ్ లో కరోనా సెకెండ్ వేవ్ రావడంతో, అప్పటికే అరకొరగా నడుస్తున్న వకీల్
సాబ్ సినిమాను థియేటర్ల నుంచి లేపేశారు. అలా తప్పనిసరి పరిస్థితుల మధ్య వకీల్ సాబ్ ఫైనల్ రన్
ముగిసిపోయింది.

అయితే దిల్ రాజుకు మాత్రం ఏదో మూల ఇంకా అసంతృప్తి ఉన్నట్టుంది. అందుకే ఇప్పుడీ సినిమాను
మరోసారి రిలీజ్ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాడట ఈ బడా నిర్మాత. త్వరలోనే థియేటర్లు
తెరుచుకోబోతున్నాయి. 50శాతం ఆక్యుపెన్సీతో తెరిచినప్పటికీ, వకీల్ సాబ్ ను మరోసారి రిలీజ్ చేయాలని
దిల్ రాజు అనుకుంటున్నాడట. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన వచ్చేలా ఉంది.

First Published:  15 Jun 2021 8:43 AM GMT
Next Story