Telugu Global
Cinema & Entertainment

డ్రగ్స్ తో పట్టుబడిన టాలీవుడ్ భామ

డ్రగ్స్ వ్యవహారంలో మరో హీరోయిన్ దొరికిపోయింది. డ్రగ్స్ వాడుతూ పోలీసులకు అడ్డంగా బుక్కయిపోయింది. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఉదంతం. ఆ హీరోయిన్ పేరు నైరా షా. ఆది సాయికుమార్ హీరోగా నటించిన బుర్రకథ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. దీంతో పాటు మరో 2-3 తెలుగు సినిమాల్లో కూడా నటించింది. మొన్న ఆదివారం తన పుట్టినరోజును జరుపుకుంది నైరా షా. ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఖరీదైన రెస్టారెంట్ లో ఫ్రెండ్స్ కు […]

డ్రగ్స్ తో పట్టుబడిన టాలీవుడ్ భామ
X

డ్రగ్స్ వ్యవహారంలో మరో హీరోయిన్ దొరికిపోయింది. డ్రగ్స్ వాడుతూ పోలీసులకు అడ్డంగా
బుక్కయిపోయింది. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఉదంతం. ఆ హీరోయిన్ పేరు నైరా షా. ఆది
సాయికుమార్ హీరోగా నటించిన బుర్రకథ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది. దీంతో పాటు మరో
2-3 తెలుగు సినిమాల్లో కూడా నటించింది.

మొన్న ఆదివారం తన పుట్టినరోజును జరుపుకుంది నైరా షా. ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఉన్న
ఖరీదైన రెస్టారెంట్ లో ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత బాయ్ ఫ్రెండ్ తో కలిసి
అదే హోటల్ లో మరో సూట్ రూమ్ కు షిఫ్ట్ అయింది. ఇద్దరూ కలిసి అక్కడ డ్రగ్స్ ఓపెన్ చేశారు.

ఎలా తెలిసిందో మొత్తానికి పోలీసుల వరకు విషయం వెళ్లింది. సరిగ్గా ఉదయం 3 గంటల ప్రాంతంలో
పక్కా ప్లాన్ తో రైడ్ చేశారు పోలీసులు. నైరా షా గదిలో నిషేధిత మాదకద్రవ్యాల్ని స్వాధీనం చేశారు.
నైరాతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ ను అరెస్ట్ చేశారు.

వైద్య పరీక్షల్లో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. ఆ తర్వాత బెయిల్ పై నైరాషా విడుదలైంది.
పోలీసులు మాత్రం ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. డ్రగ్స్ ఎలా వచ్చాయనే కోణంలో ఎంక్వయిరీ
స్టార్ట్ చేశారు.

First Published:  15 Jun 2021 8:42 AM GMT
Next Story