Telugu Global
National

తమిళనాట రాజకీయ పౌరోహిత్యం..

తమిళనాడులో పురోహితుల నియామకం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బ్రాహ్మణేతర పూజారుల నియామకానికి డీఎంకే ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంతో అసలు కథ మొదలైంది. వంశపారంపర్యంగా బ్రాహ్మణులు ఆలయాల్లో పౌరోహిత్యం చేస్తుంటారు. వారి తర్వాత వారి వారసులో, లేక అదే సామాజిక వర్గానికి చెందిన ఇంకెవరికైనా ఆ బాధ్యతలు అప్పగిస్తుంటారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంప్రదాయబద్ధంగా ఇతర కులస్తులు కూడా పౌరోహిత్యం చేస్తుంటారు. వాటిని మినహాయిస్తే.. దేవాదాయ శాఖ నిర్వహించే ఆలయాలలో బ్రాహ్మణులకే ఆ బాధ్యతలు అప్పగిస్తుంటారు. […]

తమిళనాట రాజకీయ పౌరోహిత్యం..
X

తమిళనాడులో పురోహితుల నియామకం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బ్రాహ్మణేతర పూజారుల నియామకానికి డీఎంకే ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంతో అసలు కథ మొదలైంది. వంశపారంపర్యంగా బ్రాహ్మణులు ఆలయాల్లో పౌరోహిత్యం చేస్తుంటారు. వారి తర్వాత వారి వారసులో, లేక అదే సామాజిక వర్గానికి చెందిన ఇంకెవరికైనా ఆ బాధ్యతలు అప్పగిస్తుంటారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంప్రదాయబద్ధంగా ఇతర కులస్తులు కూడా పౌరోహిత్యం చేస్తుంటారు. వాటిని మినహాయిస్తే.. దేవాదాయ శాఖ నిర్వహించే ఆలయాలలో బ్రాహ్మణులకే ఆ బాధ్యతలు అప్పగిస్తుంటారు.

తమిళనాట కొత్తగా ‘శైవ అర్చక్’..
తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం ‘శైవ అర్చక్’ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 100 రోజుల్లో 200 మంది బ్రాహ్మ‌ణేత‌రుల‌ను పూజారులుగా నియ‌మిస్తామంటోంది. ఇటీవలే వంద రోజుల ‘శైవ అర్చక్’ కోర్సుని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కోర్సు పూర్తి చేసినవారెవరైనా కులాలతో సంబంధం లేకుండా పూజారులుగా నియమితులు కావచ్చు. తమిళనాడు హిందూ మత, ఛారిట‌బుల్‌ ఎండోమెంట్ విభాగం (హెచ్ఆర్ అండ్ సీఈ) పరిధిలోని 36,000 దేవాలయాల్లో ఈ నియామకాలు జరుగుతాయి. 100 మంది బ్రాహ్మణేతర పూజారుల జాబితా కొద్ది రోజుల్లో విడుదల కానుంది. అంతే కాదు.. ఇకపై తమిళనాడు ఛారిట‌బుల్‌ ఎండోమెంట్స్ శాఖ‌ పరిధిలోని దేవాలయాల్లో పూజలు సంస్కృతంలో కాకుండా, తమిళంలోనే జ‌రుగుతాయ‌ని మంత్రి పీకే శేఖర్ బాబు చెప్పడం మరో వివాదానికి దారితీసింది.

బీజేపీ ఆగ్రహావేశాలు..
బ్రాహ్మణేతర పూజారులు, తమిళంలో పూజలు.. అని డీఎంకే ప్రభుత్వం ప్రకటించడంతో సహజంగానే బీజేపీ నేతలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. వేల సంవత్సరాల సంప్రదాయాల్ని డీఎంకే తిరగరాస్తోందని మండిపడుతున్నారు. రాజకీయ లాభాల కోసం హిందువుల్లో తేడాలు సృష్టిస్తున్నారని, గ‌త ఎన్నిక‌ల్లో డీఎంకే ఇలాగే ల‌బ్ధి పొందిందని ఆరోపిస్తున్నారు.

బ్రాహ్మణ పూజారులనుంచి వ్యతిరేకత..
100 రోజుల కోర్సు పూర్తి చేసిన తర్వాత ఎవ‌రైనా ఎలా పూజారి అవుతారు? ఇది పురాతన సంప్రదాయానికి అవమానం అంటూ తమిళనాడులోని బ్రాహ్మణ పూజారుల సంఘం ప్రతినిధులు ఆందోళనకు దిగుతున్నారు. మొత్తమ్మీద తమిళనాట బ్రాహ్మణేతర పూజారుల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది.

First Published:  13 Jun 2021 9:42 PM GMT
Next Story