Telugu Global
National

కొత్త వ్యాక్సిన్ పాలసీపై అస్పష్టత

దేశంలో కొత్త వ్యాక్సినేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ విధానం జూన్ 21 నుంచి అమలు కానుంది. అయితే ఆ వ్యాక్సినేషన్ విధానం ఇంకా అస్పష్టంగానే ఉంది. కొత్త వ్యాక్సినేషన్ విధానం ఏం చెప్తోందంటే.. జూన్ 21 నుంచి అన్ని వయస్సులవారికి కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. టీకా ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసే టీకాల్లో 75 శాతం కేంద్రమే సేకరిస్తుందని, మిగిలిన 25 శాతం ప్రైవేటు ఆసుపత్రులు సేకరించుకోవచ్చని ప్రధాని […]

కొత్త వ్యాక్సిన్ పాలసీపై అస్పష్టత
X

దేశంలో కొత్త వ్యాక్సినేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ విధానం జూన్ 21 నుంచి అమలు కానుంది. అయితే ఆ వ్యాక్సినేషన్ విధానం ఇంకా అస్పష్టంగానే ఉంది. కొత్త వ్యాక్సినేషన్ విధానం ఏం చెప్తోందంటే..

జూన్ 21 నుంచి అన్ని వయస్సులవారికి కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. టీకా ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసే టీకాల్లో 75 శాతం కేంద్రమే సేకరిస్తుందని, మిగిలిన 25 శాతం ప్రైవేటు ఆసుపత్రులు సేకరించుకోవచ్చని ప్రధాని మోదీ వెల్లడించారు.

ప్రైవేటు ఆసుపత్రులలో ఆమోదించబడిన మూడు కోవిడ్ -19 వ్యాక్సిన్ల నిర్వహణకు కూడా కేంద్రం ధరలను కూడా నిర్ణయించింది. ప్రైవేట్ కేంద్రాల్లో ఒక డోసు కోవిషీల్డ్‌కు రూ .780, కోవాక్సిన్‌కు రూ .1,410, స్పుత్నిక్ వికి రూ .1,145 గా నిర్ణయించారు.

పాలసీపై ప్రకటన చేసినప్పటికీ దాని ఆచరణలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఇప్పటికీ ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ సేకరణ కష్టంగానే ఉంది. ప్రధాని మోదీ ప్రకటించిన కొత్త వ్యాక్సిన్ పాలసీ ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ల సేకరణపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు చెప్తున్నాయి.

వ్యాక్సిన్ల కోసం భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్ కంపెనీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల్ని సంప్రదించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని ప్రైవేటు వైద్య సంస్థలు తెలిపాయి. అందుకే వ్యాక్సినేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని అంటున్నాయి.

మరో పక్క సీరమ్ ఇనిస్టిట్యూట్ రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్ కేంద్ర ఆరోగ్య శాఖకు ఓ లేఖ రాశారు. అందులో ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రైవేటు ఆసుపత్రుల్నించి ఎలాంటి ఆర్డర్లు,పేమెంట్లు తీసుకోవడం లేదని, ప్రైవేటు సంస్థలకువ్యాక్సిన్లు సరఫరా చేసే విషయంలో రోడ్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నామని సీరమ్ ఇనిస్టిట్యూట్ రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్‌ ప్రకాశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
ఒకపక్క వ్యాక్సిన్ ఇస్తామని, ప్రైవేట్ సంస్థలు కూడా వ్యాక్సిన్లు కొనుగోలు చేయొచ్చని ప్రజలకు చెప్తూనే దానికి కావాల్సిన ఏర్పాట్లు, పర్మిషన్లు విషయంలో జాప్యం చేస్తున్నారు. ఇప్పటికీ వ్యాక్సినేషన్ పాలసీ విషయంలో అస్పష్టత ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా దేశంలో వ్యాక్సినేషన్ నెమ్మదించి, రాష్ట్రాలన్నీ కేంద్రం సాయం కోసం ఎదురుచూస్తున్నాయి.

First Published:  14 Jun 2021 4:50 AM GMT
Next Story