Telugu Global
Cinema & Entertainment

పవన్ సినిమా పేరు అదేనా?

పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి రోజుకో పుకారు షికారు చేస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ పేరు తెరపైకి వచ్చింది. అదే స్టేట్ కి ఒక్కడు. పవన్ -హరీష్ శంకర్ సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతోంది. నిజంగా పవన్ క్రేజ్ కు సరిగ్గా సూట్ అయ్యే టైటిల్ ఇది. కానీ అది అఫీషియల్ కాదు. ఏదైనా ఉంటే తామే అధికారికంగా చెబుతామంటూ ఈమధ్య […]

పవన్ సినిమా పేరు అదేనా?
X

పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి రోజుకో పుకారు షికారు
చేస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ పేరు తెరపైకి వచ్చింది. అదే స్టేట్ కి ఒక్కడు. పవన్
-హరీష్ శంకర్ సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతోంది.

నిజంగా పవన్ క్రేజ్ కు సరిగ్గా సూట్ అయ్యే టైటిల్ ఇది. కానీ అది అఫీషియల్ కాదు. ఏదైనా ఉంటే తామే
అధికారికంగా చెబుతామంటూ ఈమధ్య మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది కూడా. కాబట్టి స్టేట్ కు ఒక్కడు
అనే టైటిల్ ఫేక్ అన్నమాట.

ఇక పవన్ కల్యాణ్ మిగతా సినిమాల విషయానికొస్తే.. వకీల్ సాబ్ తర్వాత 2 సినిమాలు షూటింగ్ దశలో
ఉన్నాయి. అందులో ఒకటి ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం ఈ సినిమాని
నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. మరో సినిమా మలయాళ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్
కోషియుమ్’కు రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు రానా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా
కొంత జరిగింది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

First Published:  13 Jun 2021 6:36 AM GMT
Next Story