Telugu Global
NEWS

పంజాబ్​లో కొత్త పొత్తు..! బీజేపీకి నష్టం తప్పదా?

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్​లో కొత్త పొత్తు పొడిచింది. అక్కడ శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ పొత్తు కుదర్చుకున్నాయి. దీంతో పంజాబ్​ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గతంలో శిరోమణి అకాలీదళ్​ .. ఎన్డీయేతో పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై పంజాబ్​, హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో శిరోమణి అకాలీదళ్​ ఎన్డీయే నుంచి తప్పుకున్నది. కేంద్రమంత్రిగా ఉన్న హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తన పదవికి రాజీనామా […]

పంజాబ్​లో కొత్త పొత్తు..! బీజేపీకి నష్టం తప్పదా?
X

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్​లో కొత్త పొత్తు పొడిచింది. అక్కడ శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ పొత్తు కుదర్చుకున్నాయి. దీంతో పంజాబ్​ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గతంలో శిరోమణి అకాలీదళ్​ .. ఎన్డీయేతో పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.

అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై పంజాబ్​, హర్యానా రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో శిరోమణి అకాలీదళ్​ ఎన్డీయే నుంచి తప్పుకున్నది. కేంద్రమంత్రిగా ఉన్న హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తన పదవికి రాజీనామా చేశారు.

ప్రస్తుతం శిరోమణి అకాలీదళ్.. బీఎస్పీతో పొత్తు కుదర్చుకున్నది. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్​లో బీఎస్పీకి 20 సీట్లు కేటాయించారు. శిరోమణి అకాలీదళ్ 97 స్థానాల్లో పోటీచేయబోతున్నది. ఈ సందర్భంగా
శిరోమణి అకాలీదళ్​ చీఫ్​ సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ మాట్లాడుతూ.. పంజాబ్ రాజకీయాల్లో ఇది ఒక చరిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు. అయితే అకాలీదళ్​ బీఎస్పీకి ఉన్న దళితుల ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని పొత్తుకు మొగ్గుచూపినట్టు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా దళితులకు 32 శాతం ఓటు బ్యాంక్​ ఉంది. జలంధర్, హోషియార్‌పూర్, నవాన్‌షహర్, కపుర్తలా జిల్లాల్లో దళితుల ప్రభావం ఎక్కువ. దీంతో ఆ సారి తమ కూటమికి తిరుగులేదని అకాలీదళ్​, బీఎస్పీ భావిస్తున్నాయి.

గతంలో ఎన్డీయే తో పొత్తు పెట్టుకోవడం వల్ల దళితులు తమకు దూరమయ్యారని.. వారంతా కాంగ్రెస్​కు ఓటేశారని అకాలీదళ్​ భావిస్తున్నది. ప్రస్తుతం బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వల్ల దళితులు తమ వైపునకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటున్నది. గతంలో కూడా ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్, బీఎస్పీ కలిసి పోటీచేసి 13 ఎంపీ స్థానాలకు గాను 11 సీట్లను గెలుచుకున్నాయి.

ఆ సీన్​ ఇప్పుడు మళ్లీ రిపీట్​ అవుతుందని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. మరోవైపు పంజాబ్​లో ప్రస్తుతం కాంగ్రెస్​ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పార్టీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. పంజాబ్​ సీఎం.. అమరీందర్​ సింగ్​ ప్రశాంత్ కిశోర్​ నుంచి రాజకీయ సలహాలు తీసుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం అక్కడి రాజకీయ పరిణామాలను గమనిస్తే.. బీజేపీ నష్ట పోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే పంజాబ్​, హర్యానా రాష్ట్రాల్లో రైతులు ఆ పార్టీ పట్ల కోపంగా ఉన్నారు. అకాలీదళ్​, బీఎస్పీ పొత్తు సక్సెస్​ అయితే ప్రజలు అటు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. లేదంటే కాంగ్రెస్​ వైపైనా ఉంటారు. అంతేకానీ.. బీజేపీకి ఓటు వేసే పరిస్థితి లేదు. దీంతో బీజేపీ కి నష్టం తప్పదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

First Published:  13 Jun 2021 11:03 AM GMT
Next Story