Telugu Global
National

థర్డ్​వేవ్​ చిన్నపిల్లలకు ప్రమాదమే కాదు? లాన్సెట్​ జర్నల్​లో సంచలన కథనం..!

కరోనా థర్డ్ వేవ్​ రాబోతున్నదని .. ఈ సారి ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రమాదంలో పడతారని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి వేవ్​లో వృద్ధులు, రెండో వేవ్​లో యువకులు, మధ్యవయస్కుల వాళ్లు కరోనా బారిన పడ్డారు. కాబట్టి ఈ సారి చిన్నపిల్లలకు కరోనా ప్రమాదం ఎక్కువగా అంచనాలు కొనసాగుతున్నాయి. దీంతో చిన్నపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఎయిమ్స్​ డైరెక్టర్​ గులేరియా స్పందించారు. థర్డ్​వేవ్​లో చిన్నపిల్లలకు కరోనా సోకుతుందని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని […]

థర్డ్​వేవ్​ చిన్నపిల్లలకు ప్రమాదమే కాదు? లాన్సెట్​ జర్నల్​లో సంచలన కథనం..!
X

కరోనా థర్డ్ వేవ్​ రాబోతున్నదని .. ఈ సారి ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రమాదంలో పడతారని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి వేవ్​లో వృద్ధులు, రెండో వేవ్​లో యువకులు, మధ్యవయస్కుల వాళ్లు కరోనా బారిన పడ్డారు. కాబట్టి ఈ సారి చిన్నపిల్లలకు కరోనా ప్రమాదం ఎక్కువగా అంచనాలు కొనసాగుతున్నాయి. దీంతో చిన్నపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

అయితే ఈ విషయంపై ఎయిమ్స్​ డైరెక్టర్​ గులేరియా స్పందించారు. థర్డ్​వేవ్​లో చిన్నపిల్లలకు కరోనా సోకుతుందని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ థర్డ్​వేవ్​పై పుకార్లు ఆగడం లేదు. ప్రస్తుతం వృద్ధులు, మధ్య వయస్సుల వాళ్ల వ్యాక్సినేషన్​ తీసుకున్నారు. వారు ఇప్పటికే కరోనాతో ఎఫెక్ట్ అయ్యారు.

కాబట్టి ఈ సారి చిన్నపిల్లలకు కరోనా సోకే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ చిన్నపిల్లలకు కరోనా సోకితే.. ఎటువంటి లక్షణాలు వస్తాయి. ఎంతమంది సీరియస్​ అవుతారు. తదితర విషయాలపై కొందరు నిపుణులు ఆందోళనకరమైన ప్రకటనలు చేస్తున్నారు.

ఇటీవల ఓ కెమికల్ ఇంజినీర్​ థర్డ్​వేవ్​ సంబంధించి ఓ మీడియా చానల్ తో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్​గా మారాయి. కొంతమంది ఆయన వాదనను ఖండించారు. అయినప్పటికీ చాలా మందిలో భయాందోళనలు నెలకొన్నాయి. సదరు వీడియోలో వైరస్​ మ్యూటెంట్​ చెందింది కాబట్టి బలపడే అవకాశం ఉందని కెమికల్​ ఇంజినీర్​ చెప్పుకొచ్చారు.

దీన్నికూడా చాలా మంది ఖండిస్తున్నారు. వైరస్​ మ్యూటెంట్​ అయిన ప్రతీసారి బలంగా తయారు కావాలన్న రూల్​ ఏమీ లేదు. ఒక్కోసారి బలహీనం కూడా కావచ్చు. గతంలో చాలా వైరస్​లు మ్యూటెంట్​ అయ్యి బలహీనం అయ్యాయి’ అంటూ కొందరు నిపుణులు అంటున్నారు.

అయితే తాజాగా థర్డ్​వేవ్​ చిన్నపిల్లలపై ప్రభావం అనే విషయంపై ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్​ ‘లాన్సెట్ ట్​ జర్నల్​ ’ ఓ సంచనల కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. ’ థర్డ్​వేవ్​లో చిన్నపిల్లలకు కరోనా సోకుతుంది. చాలా మందికి సీరియస్​ అవుతుంది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. చిన్నపిల్లలకు కూడా కరోనా వస్తే రావచ్చు. అంత మాత్రం చేత భయపడాల్సి అవసరం లేదు. వారిలో కూడా సాధారణ లక్షణాలే ఉంటాయి.

మామూలుగా ఫస్ట్, సెకండ్​ వేవ్​లో ఎలాగైతే కొంతమందికి కరోనా తీవ్ర లక్షణాలతో వచ్చిందో? థర్డ్​వేవ్​లో కూడా అలాగే రావచ్చు. అంతేకానీ చిన్నపిల్లల్లో కరోనా విజృంభిస్తుంది. అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు’ అంటూ లాన్సెట్ జర్నల్​లో ఓ కథనం ప్రచురించారు. .

First Published:  13 Jun 2021 1:41 AM GMT
Next Story