Telugu Global
National

కొత్త ఐటీ పాలసీ కరెక్టేనా?

భారతదేశంలో కొత్తగా అమలు చేసిన ‘డిజిటల్ సెన్సార్‌షిప్’ ను నిలిపివేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కులను ఈ కొత్త నిబంధ‌న‌ ఉల్లంఘిస్తుందని వారు అంటున్నారు. భారతదేశంలో అమలవుతున్న కొత్త ఐటీ నిబంధనలను నిలిపివేయాలని డజనుకు పైగా డిజిటల్ థింక్ ట్యాంకులు కోరుతున్నాయి. థింక్ ట్యాంక్ లు అంటే నిర్దిష్ట రాజకీయ లేదా ఆర్థిక సమస్యలపై సలహాలు, ఆలోచనలను అందించే నిపుణుల బృందాలు. ఎలక్ట్రానిక్స్ ఫ్రాంటియర్ ఫౌండేషన్, యాక్సెస్ […]

కొత్త ఐటీ పాలసీ కరెక్టేనా?
X

భారతదేశంలో కొత్తగా అమలు చేసిన ‘డిజిటల్ సెన్సార్‌షిప్’ ను నిలిపివేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కులను ఈ కొత్త నిబంధ‌న‌ ఉల్లంఘిస్తుందని వారు అంటున్నారు.

భారతదేశంలో అమలవుతున్న కొత్త ఐటీ నిబంధనలను నిలిపివేయాలని డజనుకు పైగా డిజిటల్ థింక్ ట్యాంకులు కోరుతున్నాయి. థింక్ ట్యాంక్ లు అంటే నిర్దిష్ట రాజకీయ లేదా ఆర్థిక సమస్యలపై సలహాలు, ఆలోచనలను అందించే నిపుణుల బృందాలు. ఎలక్ట్రానిక్స్ ఫ్రాంటియర్ ఫౌండేషన్, యాక్సెస్ నౌ, ఆర్టికల్ 19, హ్యూమన్ రైట్స్ వాచ్, ఇంటర్నెట్ సాన్స్ ఫ్రాంటియర్స్ , ఇంటర్నెట్ సొసైటీ వంటి లాభాపేక్ష లేని కొన్ని సంస్థలు గత నెలలో అమల్లోకి వచ్చిన ఇండియా కొత్త డిజిటల్ పాలసీని నిలిపివేయమని ప్రభుత్వాన్ని కోరాయి.

వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా ఖాతాలపై అమలు చేసే బ్లాకింగ్ ఆర్డర్‌లను, వాటిని బ్లాక్ చేయడానికి గల కారణాలను బహిరంగపరచాలని వాళ్లు లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. నిరసనలను చేసే హక్కును తొక్కి పెట్టడం, అసమ్మతిని తెలియజేయడాన్ని నేరపూరితంగా చూడడం సరైన విధానం కాదని వారంటున్నారు.

భారత ప్రభుత్వం అమలు చేసిన వెబ్ సెన్సార్ షిప్, యూజర్ డేటా ఆర్డర్లు న్యాయ లేదా స్వతంత్ర పరిపాలనా ప్రక్రియ కిందకు రావని, అవి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలని అవన్నీ మానవ హక్కులను ఉల్లఘించడం కిందకు వస్తాయని వారంటున్నారు. ఈ కొత్త నిబంధనలు వినియోగదారుల హక్కులకు హాని కలిగించడంతో పాటు అకారణంగా వారిని బెదిరించడానికి ఉపయోగపడతాయని వారు లేఖలో పేర్కొన్నారు.

భారతదేశంలో పనిచేస్తున్న టెక్నాలజీ కంపెనీలు, ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లను కట్టుదిట్టం చేసే బదులు నిర్ధిష్టమైన ఆదేశాలనిచ్చి, సమర్థవంతమైన చర్యలు చేపట్టడం ద్వారా ప్రైవసీ, భావ వ్యక్తీకరణ, దేశ భద్రతలను పరిరక్షించుకోవచ్చని, దానికోసం భావ వ్యక్తీకరణ హక్కును హరించడం సరికాదని వారు లేఖలో పేర్కొన్నారు.

First Published:  12 Jun 2021 4:21 AM GMT
Next Story