Telugu Global
National

యూపీ సీఎం యోగిని మార్చేస్తారా? నిజమెంత?

ఉత్తర్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను మార్చేయబోతున్నారని.. త్వరలో యూపీలో ఎన్నికలు జరగనుండటంతో అక్కడ నాయకత్వ మార్పు చేయాలని బీజేపీ హైకమాండ్​ భావిస్తున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కట్టడిలో యూపీ సీఎం ఫెయిల్​ అయ్యారని మీడియా దుమ్మెత్తిపోసింది. జాతీయ మీడియాతోపాటు, అంతర్జాతీయ మీడియా సైతం యోగి ఫెయిల్ అయ్యారని కథనాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో యూపీలో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో యోగిని పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో మరోనేతను ముఖ్యమంత్రిగా […]

యూపీ సీఎం యోగిని మార్చేస్తారా? నిజమెంత?
X

ఉత్తర్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను మార్చేయబోతున్నారని.. త్వరలో యూపీలో ఎన్నికలు జరగనుండటంతో అక్కడ నాయకత్వ మార్పు చేయాలని బీజేపీ హైకమాండ్​ భావిస్తున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కట్టడిలో యూపీ సీఎం ఫెయిల్​ అయ్యారని మీడియా దుమ్మెత్తిపోసింది. జాతీయ మీడియాతోపాటు, అంతర్జాతీయ మీడియా సైతం యోగి ఫెయిల్ అయ్యారని కథనాలు ప్రసారం చేసింది.

ఈ నేపథ్యంలో యూపీలో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో యోగిని పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో మరోనేతను ముఖ్యమంత్రిగా నియమించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో యోగి.. ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఆయన త్వరలో ప్రధాని నరేంద్రమోదీని కలవబోతున్నట్టు సమాచారం.

మరోవైపు వచ్చే ఏడాది అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల కాంగ్రెస్​ సీనియర్​ నేత
జితిన్‌ ప్రసాద బీజేపీలో చేరారు. ఆయన బీజేపీలో చేరిన 24 గంటల్లోనే యోగి ఆదిత్యనాథ్​ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా యోగి ఆదిత్యనాథ్‌ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నివాసానికి చేరుకున్నారు. అప్నా దళ్‌ ఎంపీ అనుప్రియా పటేల్‌ కూడా గురువారం సాయంత్రం అమిత్‌ షాతో సమావేశమైనట్లు సమాచారం. యోగి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

First Published:  11 Jun 2021 1:20 AM GMT
Next Story