Telugu Global
Health & Life Style

శ్వాస ఆరోగ్యానికి స్మార్ట్ వాచీలు

ఈ కోవిడ్ టైంలో మన పల్స్ రేటును, శ్వాస ఆరోగ్యాన్ని ఓకంట గమనిస్తూ ఉండడం ఎంతైనా అవసరం. అందుకే బేసిక్ ఆరోగ్యాన్ని చెక్ చేసుకునే కొన్ని టూల్స్ ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండాలి. దానికోసం స్మార్ట్ వాచీలు బెస్ట్ ఆప్షన్స్. ఇవి మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ.. హార్ట్‌ రేటు, బ్లడ్‌ సాచ్యురేషన్‌ లెవెల్స్‌ లాంటివాటిని మానిటర్ చేస్తూ ఉంటాయి. మార్కెట్లో వివిధ ధరల్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచీలేంటంటే.. యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ మార్కెట్లో […]

శ్వాస ఆరోగ్యానికి స్మార్ట్ వాచీలు
X

ఈ కోవిడ్ టైంలో మన పల్స్ రేటును, శ్వాస ఆరోగ్యాన్ని ఓకంట గమనిస్తూ ఉండడం ఎంతైనా అవసరం. అందుకే బేసిక్ ఆరోగ్యాన్ని చెక్ చేసుకునే కొన్ని టూల్స్ ఎప్పుడూ మనకు అందుబాటులో ఉండాలి. దానికోసం స్మార్ట్ వాచీలు బెస్ట్ ఆప్షన్స్. ఇవి మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ.. హార్ట్‌ రేటు, బ్లడ్‌ సాచ్యురేషన్‌ లెవెల్స్‌ లాంటివాటిని మానిటర్ చేస్తూ ఉంటాయి. మార్కెట్లో వివిధ ధరల్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచీలేంటంటే..

యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ
మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ హెల్త్ ట్రాకింగ్ స్మార్ట్ వాచీల్లో యాపిల్ వాచ్ ఒకటి. దీని ధర రూ.32,900 నుంచి మొదలవుతుంది. 64-బిట్‌ డ్యూయల్‌ కోర్‌ ఎస్‌5 ప్రాసెసర్‌ పవర్‌ కలిగిన ఈ వాచీ.. రోజువారీ జీవితంలో నిద్ర నుంచి నడక వరకూ అన్నీ యాక్టివిటీస్ ను ట్రాక్ చేయగలదు. ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్రీతింగ్ మానిటరింగ్‌ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఫాజిల్‌ జనరేషన్‌ 5
దీని ధర రూ.22,990 వరకూ ఉంటుంది. ఇది బ్రీతింగ్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లను గైడ్‌ చేయడంతో పాటు హార్ట్ రేట్, నడక , నిద్రలను కూడా ట్రాక్ చేస్తుంది. ఇందులో ఇన్‌ బిల్ట్‌ జీపీఎస్‌, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇది స్విమ్‌ ప్రూఫ్‌ డిజైన్‌తో వస్తుంది.

గార్మిన్‌ వివోస్మార్ట్‌ 4
ఈ స్మార్ట్‌ వాచీ ధర రూ.12,160 వరకూ ఉంటుంది. ఇందులో గైడెడ్‌ బ్రీతింగ్‌ ఫీచర్‌ ఉంటుంది. అలాగే ఇందులో అడ్వాన్స్‌డ్‌ స్లీప్‌ మానిటరింగ్‌, బ్లడ్‌లో ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ లెవెల్స్‌ను ట్రాక్‌ చేసే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది రకరకాల వ్యాయామాలకు తగ్గట్టు యాక్టివిటీస్ ను కూడా ట్రాక్ చేస్తుంది.

నాయిస్‌ కలర్‌ఫిట్‌ ప్రో 3
దీని ధర రూ.4,499 వరకూ ఉంటుంది. ఇందులో ఇన్‌ బిల్ట్‌ ఆక్సీమీటర్‌తో పాటు, స్లీప్‌ పాటర్న్స్‌, స్లీప్‌ బ్రీత్‌ క్వాలిటీని కూడా మానిటర్‌ చేస్తుంది. ఇది బ్రీత్‌ గైడ్‌ సపోర్ట్‌, స్ట్రెస్‌ మానిటరింగ్‌, హర్ట్‌ రేట్‌ ట్రాకింగ్‌, యాక్టివిటీ ట్రాకింగ్ కూడా చేస్తుంది.

అమేజ్‌ఫిట్‌ బిప్‌ యూ
దీని ధర రూ.3,999 వరకూ ఉంటుంది. ఇందులో రకరకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. చేస్తున్న యాక్టివటీని బట్టి క్యాలరీ బర్నింగ్స్ ను కాలిక్యులేట్ చేస్తుంది. అలాగే ఇందులో స్ట్రెస్‌ మానిటరింగ్‌, బ్రీత్‌ ట్రైనింగ్‌, హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌, స్లీప్‌ ట్రాకింగ్‌, కాల్‌ నోటిఫికేషన్స్‌ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

First Published:  11 Jun 2021 2:13 AM GMT
Next Story