Telugu Global
National

పంజాబ్​లో కాంగ్రెస్​ కుమ్ములాట.. అమరీందర్​ వర్సెస్​ సిద్దూ..!

కాంగ్రెస్​ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలు. ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా అసమ్మతి స్వరాలు వినిపించడం గ్రూపు రాజకీయాలు చేయడం ఆ పార్టీలో సహజంగా జరుగుతూ ఉంటుంది. మామూలుగా ప్రాంతీయ పార్టీల్లో అధినేత చెప్పిందే వేదం. ఇష్టం ఉన్నా లేకపోయినా.. ఆ నిర్ణయాన్ని అంతా సహించవలసిందే. కానీ, కాంగ్రెస్​ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పార్టీ నేతలు .. సొంతపార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్​ పార్టీలో ఎవరైనా లీడర్​గా […]

పంజాబ్​లో కాంగ్రెస్​ కుమ్ములాట.. అమరీందర్​ వర్సెస్​ సిద్దూ..!
X

కాంగ్రెస్​ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలు. ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా అసమ్మతి స్వరాలు వినిపించడం గ్రూపు రాజకీయాలు చేయడం ఆ పార్టీలో సహజంగా జరుగుతూ ఉంటుంది. మామూలుగా ప్రాంతీయ పార్టీల్లో అధినేత చెప్పిందే వేదం. ఇష్టం ఉన్నా లేకపోయినా.. ఆ నిర్ణయాన్ని అంతా సహించవలసిందే.

కానీ, కాంగ్రెస్​ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పార్టీ నేతలు .. సొంతపార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్​ పార్టీలో ఎవరైనా లీడర్​గా ఎదగాలంటే ముందుగా సొంత పార్టీ నేతల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పి.. వారిని తన గ్రిప్​లోకి తెచ్చుకోవాలి. అలా చేస్తేనే పార్టీలో భవిష్యత్​. ఏపీలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వైఎస్​ రాజశేఖరరెడ్డి.. సైతం కాంగ్రెస్​ గ్రూపు రాజకీయాలను ఫేస్​ చేసిన వారే.

అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం పంజాబ్​లో గ్రూపు రాజకీయం పీక్స్​కు చేరింది. పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​, ఆ పార్టీ నేత నవజ్యోత్​ సిద్దూ నడుమ పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఇద్దరికీ క్షణం కూడా పడటం లేదు.

ఇటీవల పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్​ పై .. 30 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట. అయితే వారంతా సిద్దూ ప్రోద్బలంతోనే ఫిర్యాదు చేశారని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్కడ పోస్టర్ల రాజకీయం రసవత్తరంగా మారింది. నవజ్యోత్​సింగ్ సిద్దూ కనిపించడం లేదని.. అతడిని పట్టిస్తే రూ. 50 వేలు ప్రైజ్​ మనీ ఇస్తామంటూ షాషిద్​ దీప్​ సింగ్​ సేవా సొసైటీ ఆధ్వర్యంలో కొందరు అమృత్​ సర్​లో పోస్టర్లు అంటించారు.

మరోవైపు సీఎం అమరీందర్​కు వ్యతిరేకంగా పాటియాలాలో పోస్టర్లు వెలిశాయి. ఇలా అక్కడ గ్రూపు రాజకీయాలు, పోస్టర్ల బాగోతాలు కాంగ్రెస్​ హైకమాండ్​ కు తలనొప్పిగా మారాయి. ఓ వైపు దేశంలో కేంద్రప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందని అంతా ఆరోపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్​ విఫలమైంది.

మరోవైపు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం సమస్యలు చుట్టుముట్టాయి. పంజాబ్​లో పరిస్థితిని చక్కదిద్దేందుకు.. కాంగ్రెస్​ అధిష్ఠానం మల్లికార్జున్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఒక ప్యానల్​ను నియమించింది. పంజాబ్​ కాంగ్రెస్​ పార్టీ ఇన్​చార్జ్​ హరీష్​ రావత్​, మాజీ ఎంపీ జేపీ అగర్వాల్​ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఏం తేల్చుతుందో వేచి చూడాలి.

First Published:  11 Jun 2021 1:34 AM GMT
Next Story