Telugu Global
National

బెంగాల్ లో బెడిసికొట్టిన ఆకర్ష్.. యూపీలో ఫలిస్తుందా..?

పశ్చిమబెంగాల్ ఎన్నికల ముందు.. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వలసల్ని భారీగా ప్రోత్సహించింది బీజేపీ. మమతా బెనర్జీ తర్వాత పార్టీలో నెంబర్-2 గా ఉన్న సువేందు అధికారితో మొదలు పెట్టి.. చోటా మోటా నేతలందర్నీ లాగేసుకుంది. కట్ చేస్తే.. అక్కడ సీన్ రివర్స్ అయింది. అతిగా ఆవేశపడి బీజేపీలో చేరిన బ్యాచ్ లో 80శాతం మంది ఓటమి చవిచూశారు. అధికారం మాదే, మ్యాజిక్ మార్క్ మిస్ అయినా.. ఏదోరకంగా బెంగాల్ పీఠం దక్కించుకుంటామని ఆశపడ్డ బీజేపీకి భంగపాటు ఎదురైంది. […]

బెంగాల్ లో బెడిసికొట్టిన ఆకర్ష్.. యూపీలో ఫలిస్తుందా..?
X

పశ్చిమబెంగాల్ ఎన్నికల ముందు.. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వలసల్ని భారీగా ప్రోత్సహించింది బీజేపీ. మమతా బెనర్జీ తర్వాత పార్టీలో నెంబర్-2 గా ఉన్న సువేందు అధికారితో మొదలు పెట్టి.. చోటా మోటా నేతలందర్నీ లాగేసుకుంది. కట్ చేస్తే.. అక్కడ సీన్ రివర్స్ అయింది. అతిగా ఆవేశపడి బీజేపీలో చేరిన బ్యాచ్ లో 80శాతం మంది ఓటమి చవిచూశారు. అధికారం మాదే, మ్యాజిక్ మార్క్ మిస్ అయినా.. ఏదోరకంగా బెంగాల్ పీఠం దక్కించుకుంటామని ఆశపడ్డ బీజేపీకి భంగపాటు ఎదురైంది. అలా వచ్చిన బ్యాచ్ అంతా ఇప్పుడు టీఎంసీ గూటికి చేరుకోడానికి ప్లాన్ చేస్తున్నారంటే బీజేపీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టిట్ ఫర్ టాట్ లాగా మమతా కూడా.. ఇప్పుడు బీజేపీని ఖాళీ చేయడానికి తెలివిగా అడుగులేస్తున్నారు. వలస వెళ్లినవారినే కాదు, బీజేపీ ఎమ్మెల్యేలను కూడా లాగేసుకోడానికి వ్యూహాలు రచిస్తున్నారు.

బెంగాల్ ముచ్చట పక్కనపెడితే.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ లో కూడా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. కాంగ్రెస్ నుంచి కీలక నేత జితిన్ ప్రసాద బీజేపీ గూటికి వచ్చేస్తున్నారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన జితిన్ ప్రసాద, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అలాంటి నేతనే ఇప్పుడు బీజేపీ తమవైపు లాగేసుకుంది. ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీనుంచి కూడా త్వరలోనే మరిన్ని వలసలుంటాయని అంటున్నారు.

ఓటమి భయంతోనే ఇదంతా..
403 స్థానాల యూపీ అసెంబ్లీలో బీజేపీ బలం 306. మిత్రపక్షం ఏడీ(ఎస్)తో కలుపుకొంటే 315. అయితే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీకి యూపీలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభ మసకబారుతోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం ఎస్పీ సహా కాంగ్రెస్, బీఎస్పీ కూడా బాగా బలం పుంజుకున్నాయి. అదే సమయంలో బీజేపీ బలం సగానికి సగం పడిపోయింది. కరోనా పరిస్థితుల్ని చక్కదిద్దడంలో యోగి సర్కారు విఫలం కావడంతోపాటు, ఇతరత్రా స్థానిక సమస్యలు కూడా ఆ పార్టీ గెలుపుపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో బీజేపీ ఆలోచనలో పడింది. ఇద్దరు సీనియర్లతో యూపీ పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఓ దశలో యోగి ముఖ్యమంత్రి పీఠం కదులుతుందనే సంకేతాలు వెలువడినా ఎన్నికల ఏడాదిలో అన్నిప్రయోగాలు ఎందుకని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఇతర పార్టీ కీలక నేతలకు గాలమేస్తున్నారు బీజేపీ నేతలు. మరి ఈ ప్రయోగం ఫలిస్తుందా.. లేక బెంగాల్ లో లాగా వికటిస్తుందా.. వేచి చూడాలి.

First Published:  9 Jun 2021 9:22 PM GMT
Next Story