Telugu Global
Cinema & Entertainment

అన్‌లాక్ మొదలైంది.. సినిమాల పరిస్థితేంటంటే..

ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ ఊపు తగ్గి అన్ లాక్ ప్రక్రియ మొదలవుతోంది. మెల్లగా సినిమా షూటింగ్ లు, థియేటర్స్ మెల్లగా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సినిమా హాళ్లు ఓపెన్ అయితే ముందుగా రిలీజ్ అయ్యే సినిమాలు ఏవంటే.. కోవిడ్ తో సినిమా ఇండస్ట్రీ తీవ్రమైన నష్టాల్ని ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ తగ్గించడంతో ఈ నెలాఖరు నుంచి షూటింగ్స్ స్టార్ట్ చేసేలా ప్లాన్ లో ఉన్నారు చాలామంది. షూటింగ్స్ మొదలైతే.. మెల్లగా థియేటర్లు కూడా తెరుచుకుంటాయి. […]

అన్‌లాక్ మొదలైంది.. సినిమాల పరిస్థితేంటంటే..
X

ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ ఊపు తగ్గి అన్ లాక్ ప్రక్రియ మొదలవుతోంది. మెల్లగా సినిమా షూటింగ్ లు, థియేటర్స్ మెల్లగా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సినిమా హాళ్లు ఓపెన్ అయితే ముందుగా రిలీజ్ అయ్యే సినిమాలు ఏవంటే..

కోవిడ్ తో సినిమా ఇండస్ట్రీ తీవ్రమైన నష్టాల్ని ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ తగ్గించడంతో ఈ నెలాఖరు నుంచి షూటింగ్స్ స్టార్ట్ చేసేలా ప్లాన్ లో ఉన్నారు చాలామంది. షూటింగ్స్ మొదలైతే.. మెల్లగా థియేటర్లు కూడా తెరుచుకుంటాయి.

గత రెండు మూడు నెలల నుంచి మూసేసిన థియేటర్లు వచ్చే నెలలో తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ థియేటర్లు ఓపెన్ అయితే ముందుగా చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. మన తెలుగులో.. తేజ సజ్జా నటించిన ‘ఇష్క్’, విశ్వక్ సేన్ నటించిన ‘పాగల్’ , ‘రౌడీ బాయ్స్’, ‘గుడ్ లక్ సఖి’, ‘తిమ్మరసు’, ‘సెహరి’ లాంటి సినిమాలు ముందుగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

వాటి రెస్పాన్స్ ను బట్టి ఆగస్ట్ నెలలో రిలీజ్ కు రెడీగా ఉండి కోవిడ్ తో ఆగిపోయిన ‘లవ్ స్టోరీ’, ‘విరాట పర్వం’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. వాటి తర్వాత ఒకవేళ మూడో వేవ్ భయం లేకపోతే.. ఇక వరుసగా పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆచార్య, అఖండ, రాధేశ్యామ్, పుష్ప, కెజియఫ్ 2 లాంటి పెద్ద సినిమాలు కూడా వీలైతే ఇదే సంవత్సరం రిలీజయ్యే ఛాన్సుంది.

First Published:  10 Jun 2021 4:19 AM GMT
Next Story