Telugu Global
Health & Life Style

చిన్నారుల కోవిడ్ చికిత్సకు మార్గదర్శకాలివే..

సెకండ్ వేవ్ తగ్గుతోందని సంతోష పడేలోపే.. థర్డ్ వేవ్ భయాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో కేంద్రం ఆదేశాలకోసం వేచి చూడకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇక కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (DGHS), తాజాగా చిన్నపిల్లల చికిత్సకోసం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ చికిత్స […]

చిన్నారుల కోవిడ్ చికిత్సకు మార్గదర్శకాలివే..
X

సెకండ్ వేవ్ తగ్గుతోందని సంతోష పడేలోపే.. థర్డ్ వేవ్ భయాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో కేంద్రం ఆదేశాలకోసం వేచి చూడకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇక కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (DGHS), తాజాగా చిన్నపిల్లల చికిత్సకోసం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ చికిత్స ప్రోటొకాల్ కేవలం పెద్దవారికి మాత్రమేనని, చిన్నారుల విషయంలో దాన్ని పాటించొద్దని క్లారిటీ ఇచ్చింది.

చిన్నపిల్లల చికిత్సలో రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల వాడకాన్ని నిషేధించింది డీజీహెచ్ఎస్. స్టెరాయిడ్ల వాడకంపై కూడా పరిమితి విధించింది. అత్యవసరమైతేనే సీటీస్కాన్ కి వెళ్లాలని సూచించింది. వైరస్ ఉందని తెలిసినా, లక్షణాలు లేనివారికి అసలు చికిత్సే అవసరం లేదని, కేవలం ఆహారం ద్వారా వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించాలని సూచించింది.

డీజీహెచ్ఎస్ గైడ్ లైన్స్..
– 18 ఏళ్లలోపు వారికి రెమిడెసివిర్‌ వాడొద్దు. చిన్నారులపై దాని ప్రభావం, భద్రతపై పూర్తి సమాచారం అందుబాటులో లేనందున.. చిన్నపిల్లల కరోనా చికిత్సలో రెమిడెసివిర్‌ తో ప్రయోగాలు చేయొద్దు.
– అత్యవసరమైతేనే హెచ్ఆర్ సీటీ స్కాన్ వాడాలి
– లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న చిన్నారులకు యాంటీ మైక్రోబయల్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు.
– వైరస్ సోకినా, లక్షణాలు లేనివారికి అసలు ఎలాంటి చికిత్స అవసరం లేదు, వారికి కేవలం బలవర్థకమైన ఆహారం మాత్రమే ఇవ్వాలి.
– స్వల్ప లక్షణాలు ఉంటే.. పారాసెట్మాల్ మాత్రలు, దగ్గు తగ్గడానికి సిరప్ మాత్రమే వాడాలి.
– ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే వెంటనే ఆక్సిజన్ చికిత్స ప్రారంభించాలి.
– ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటేనే స్వల్ప మోతాదులో స్టెరాయిడ్స్ వాడాలి

సెకండ్ వేవ్ లో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడటం వల్ల చాలామందిలో దుష్ప్రభావాలు తలెత్తాయి. షుగర్ లెవల్స్ పెరిగిపోయి బ్లాక్ ఫంగస్ కి ఆహ్వానం పలికినట్టయింది. దీంతో చిన్నారుల చికిత్స విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. థర్డ్ వేవ్ వస్తుందన్న భయాల నేపథ్యంలో చిన్నారుల చికిత్సకు మార్గదర్శకాలు విడుదలచేశారు.

First Published:  9 Jun 2021 9:36 PM GMT
Next Story