Telugu Global
International

కృత్రిమ సూర్యుడ్ని సృష్టిస్తున్న చైనా..

శక్తికి మూల కారణం సూర్యుడు. ఈ భూమిపై మనం వాడుకునే శక్తి అంతా సూర్యుడి నుంచి వచ్చిందే. కానీ మనకు ఉన్నది ఒక్కటే సూర్యుడు. మరో సూర్యుడ్ని సృష్టించగలిగితే రకరకాల ఎనర్జీ సోర్సెస్ కు కొరత ఉండదు. అందుకే కృత్రిమ సూర్యుడ్ని సృష్టించే పనిలో పడింది చైనా. అనంతమైన శక్తిని సృష్టించాలనే ప్రయత్నంలో చైనా ఓ గొప్ప ముందడుగు వేసింది. 16కోట్ల డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతను సృష్టించే ఆర్టిఫీషియల్ సన్ ను రూపొందించి రికార్డు సృష్టించింది.  ఎక్స్‌పెరిమెంటల్‌ […]

కృత్రిమ సూర్యుడ్ని సృష్టిస్తున్న చైనా..
X

శక్తికి మూల కారణం సూర్యుడు. ఈ భూమిపై మనం వాడుకునే శక్తి అంతా సూర్యుడి నుంచి వచ్చిందే. కానీ మనకు ఉన్నది ఒక్కటే సూర్యుడు. మరో సూర్యుడ్ని సృష్టించగలిగితే రకరకాల ఎనర్జీ సోర్సెస్ కు కొరత ఉండదు. అందుకే కృత్రిమ సూర్యుడ్ని సృష్టించే పనిలో పడింది చైనా.

అనంతమైన శక్తిని సృష్టించాలనే ప్రయత్నంలో చైనా ఓ గొప్ప ముందడుగు వేసింది. 16కోట్ల డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతను సృష్టించే ఆర్టిఫీషియల్ సన్ ను రూపొందించి రికార్డు సృష్టించింది. ఎక్స్‌పెరిమెంటల్‌ అడ్వాన్స్‌డ్‌ సూపర్‌కండక్టింగ్‌ టొకమాక్‌ (ఈస్ట్‌) అనే పరికరం ద్వారా ఈ ఘనతను సాధించింది. సూర్యుడిలో ఎలా అయితే శక్తి ఉత్పత్తి అవుతుందో అచ్చం అదే ప్రక్రియను అనుకరిస్తూ ఈ పరికరం పనిచేస్తుంది. రీసెంట్ గా కండక్ట్ చేసిన ఈ ప్రయోగం 20 సెకండ్ల పాటు రికార్డు స్థాయిలో సూర్యూడి కంటే పది రెట్లు ఎక్కువ వేడిని సృష్టించగలిగింది.

ఇదే ప్రాసెస్ ను ఎక్కువ కాలం కొనసాగేలా చేయటమే తమ లక్ష్యమని ప్రయోగాన్ని నిర్వహించిన చైనాలోని సదరన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆర్టిఫీషియల్ సన్ గా పిలుస్తున్నీ పరికరం ఓ రియాక్టర్‌. అచ్చం సూర్యుడి లాగానే న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ ద్వారా శక్తిని , వేడిని సృష్టిస్తుంది.

అయితే ఈ ప్రాజెక్ట్‌లో భారత్‌, దక్షిణ కొరియా, జపాన్‌, రష్యా, అమెరికా కూడా భాగస్వామ్యం వహించాయి. ఆర్టిఫీషియల్ రియాక్టర్ ద్వారా ఎలాంటి గ్రీన్‌హౌజ్‌ వాయువులూ వెలువడకుండా న్యూక్లియర్ ఫ్యూజన్ ను జరిపి ఇది సూర్యుడిలా శక్తిని సృష్టించగలదు. ఈ ప్రయోగాన్ని పూర్తిగా నిర్వహించడానికి ఇంకా సమయం పడుతుందని చైనా చెప్తోంది. ఈ ప్రయోగం అనుకున్న విధంగా సక్సెస్ అయితే తక్కువ ఖర్చుతోనే అనంతమైన శక్తిని సృష్టించవచ్చు.

First Published:  9 Jun 2021 2:46 AM GMT
Next Story