Telugu Global
National

నగదు ముద్రించి పేదల ఖాతాల్లోకి వేయండి.. కేంద్రానికి ఆర్థిక వేత్తల సూచన..!

ప్రస్తుతం కరోనాతో దేశం ఆర్థికంగా చితికిపోయిన విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్​తో చాలా మంది ఉపాధిని కోల్పోయారు. ముఖ్యంగా చిరువ్యాపారుల జీవితం అగమ్యగోచరంగా మారింది. మిగిలిన అనేక రంగాలు సైతం కుదేలయ్యాయి. ఇదిలా ఉంటే ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టాలంటే నోట్లను ముద్రించి పేద ప్రజల అకౌంట్లోకి వెయ్యాలని అలా చేస్తే.. ఆర్థిక పరిస్థితి మెరుగువుతుందని కొందరు ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. అందుకు వారు ఇతర దేశాల బ్యాంకులను ఉదాహరణగా చూపుతున్నారు. ‘కోవిడ్‌ వచ్చాక అమెరికా ఫెడరల్‌ […]

నగదు ముద్రించి పేదల ఖాతాల్లోకి వేయండి.. కేంద్రానికి ఆర్థిక వేత్తల సూచన..!
X

ప్రస్తుతం కరోనాతో దేశం ఆర్థికంగా చితికిపోయిన విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్​తో చాలా మంది ఉపాధిని కోల్పోయారు. ముఖ్యంగా చిరువ్యాపారుల జీవితం అగమ్యగోచరంగా మారింది. మిగిలిన అనేక రంగాలు సైతం కుదేలయ్యాయి.

ఇదిలా ఉంటే ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టాలంటే నోట్లను ముద్రించి పేద ప్రజల అకౌంట్లోకి వెయ్యాలని అలా చేస్తే.. ఆర్థిక పరిస్థితి మెరుగువుతుందని కొందరు ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. అందుకు వారు ఇతర దేశాల బ్యాంకులను ఉదాహరణగా చూపుతున్నారు.

‘కోవిడ్‌ వచ్చాక అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ తన బ్యాలెన్స్ షీట్‌ను పెంచుకుంది. కోవిడ్‌ ముందు 4.4 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న అమెరికా కేంద్ర ఫెడరల్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీటు ఇప్పుడు 7.1 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది’ కాబట్టి ఆర్ బీఐ కూడా బ్యాలెన్స్​ షీట్​ను పెంచుకోవాలని.. విపరీతంగా నగదును ముద్రించి పేద ప్రజల ఖాతాల్లో వేయాలని కొందరు ఆర్థికవేత్తలు, పారిశ్రామిక వేత్తలు డిమాండ్​ చేస్తున్నారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, మహీంద్రా ఎండీ ఆనంద్ మహీంద్రా, కోటక్ బ్యాంకు ఎండీ ఉదయ్ కోటక్, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ తదితరులు కేంద్రానికి సూచనలు చేసిన వారిలో ఉన్నారు.

అయితే ఈ డిమాండ్​ను మరికొందరు ఆర్థిక వేత్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు.అలా చేస్తే.. రూపాయి విలువ గణనీయంగా తగ్గిపోయి.. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా కుప్ప కూలుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

గతంలో జింబాబ్వే, వెనిజులా విచ్చలవిడిగా నోట్లు ముద్రించుకున్నాయి. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని వారు ఉదహరిస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ సైతం ఈ విషయంపై స్పందించారు. నోట్లు అధికంగా ముద్రించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో మాదిరిగానే జీడీపీ ఆధారంగానే నోట్లు ముద్రిస్తామని చెప్పారు. నోట్లు అధికంగా ముద్రిస్తే.. ప్రజలు కొనుగోలు సామర్థ్యం పెరుగుతుందని కొందరి వాదన. ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించడం లేదు.

First Published:  8 Jun 2021 1:58 AM GMT
Next Story