Telugu Global
NEWS

మూడో వేవ్ కోసం పగడ్బందీగా ప్లాన్.. పిల్లలు జర జాగ్రత్త!

కోవిడ్‌ మహమ్మారి రెండు వేవ్స్ రూపంలో దేశంపై భారీగా విరుచుకుపడింది. రెండో వేవ్ కు ముందు కరోనాను కాస్త నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం దానికి మూల్యం చెల్లించుకోక తప్పలేదు. అందుకే ఇప్పుడు మూడో వేవ్ విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. థర్డ్‌వేవ్‌తో కరోనా మరోసారి విరుచుకుపడితే ముందస్తు జాగ్రత్తలతో సమర్థంగా కట్టడి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. థర్డ్ వేవ్ వస్తే.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వైద్య, ఆరోగ్యశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. రెండు వేవ్‌లలో నమోదైన కేసులు, […]

మూడో వేవ్ కోసం పగడ్బందీగా ప్లాన్.. పిల్లలు జర జాగ్రత్త!
X

కోవిడ్‌ మహమ్మారి రెండు వేవ్స్ రూపంలో దేశంపై భారీగా విరుచుకుపడింది. రెండో వేవ్ కు ముందు కరోనాను కాస్త నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం దానికి మూల్యం చెల్లించుకోక తప్పలేదు. అందుకే ఇప్పుడు మూడో వేవ్ విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. థర్డ్‌వేవ్‌తో కరోనా మరోసారి విరుచుకుపడితే ముందస్తు జాగ్రత్తలతో సమర్థంగా కట్టడి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

థర్డ్ వేవ్ వస్తే.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వైద్య, ఆరోగ్యశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. రెండు వేవ్‌లలో నమోదైన కేసులు, వయసు, ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్యపై వారం రోజుల పాటు సమీక్ష నిర్వహించి, ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు, పీడియాట్రిక్‌ డాక్టర్లతో కలిసి ఓ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు.

మూడో వేవ్ లో వైరస్ చిన్నారులకు వ్యాపిస్తే దానికి కావాల్సిన ఎక్విప్ మెంట్ మందులు భారీగా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు ఆక్సిజన్ సిలిండర్లు, పీడియాట్రిక్‌ వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని అవసరమైన మేరకు నియమించేలా ప్లాన్ చేస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులున్న దాదాపు 15 – 20 లక్షల మంది తల్లులందరికీ కోవిడ్‌ టీకాలు ఇవ్వనున్నారు.

మూడో వేవ్ వస్తే.. చిన్నారులకు కరోనా రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. థర్డ్‌ వేవ్‌లో గరిష్టంగా 18 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, వీరిలో 18 ఏళ్ల లోపు వారు 4.50 లక్షల మంది ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు మూడో వేవ్ లో వైరస్‌ పలు రూపాంతరాలు చెంది హైబ్రిడ్‌ వేరియంట్ గా మారుతుందని నిపుణులు చెప్తున్నారు.

ఈ వేరియంట్..13 ఏళ్లలోపు పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని, శరీరం మీద దద్దుర్లు, కళ్లకింద మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు లాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉందంటున్నారు.
రాబోయే వర్షాకాలంలో పిల్లలు ఎక్కువగా జబ్బు పడే ప్రమాదం ఉన్నందున తల్లిదండ్రులు, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టగానే యధావిధిగా నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ జాగ్రత్తలను నిత్యం పాటిస్తూ ఉండాలి. కోవిడ్ నియమాలను లైఫ్ స్టైల్ లో చేర్చుకుని ఎవరి జాగ్రత్తలో వారు ఉంటేనే మహమ్మారిని ఎదుర్కోగలం. లేదంటే మరిన్ని ప్రాణాలను నష్టపోవాల్సి ఉంటుంది.

First Published:  8 Jun 2021 1:28 AM GMT
Next Story