Telugu Global
NEWS

పీవీ పేరిట జిల్లా? ఈ డిమాండ్​ వెనక అంతుచిక్కని రాజకీయం..!

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట ఓ జిల్లా ఏర్పాటు చేయాలని ఉన్నట్టుండి డిమాండ్​ పుట్టుకొచ్చింది. అయితే ఈ డిమాండ్​ ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చింది? ఇందులో ఏమన్నా రాజకీయ కారణాలు ఉన్నాయా? అన్న విషయాలపై ఆసక్తి నెలకొన్నది. నిజానికి సీఎం కేసీఆర్​ ఇప్పటికే తెలంగాణలోనూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇన్ని జిల్లాలు అవసరమా? అన్న ప్రశ్నకూడా తలెత్తింది. తాజాగా మరోసారి పీవీ నరసింహారావు పేరిట ఓ జిల్లా ఏర్పాటు చేయాలన్న అంశం తెరమీదకు వచ్చింది. ఇటీవల […]

పీవీ పేరిట జిల్లా? ఈ డిమాండ్​ వెనక అంతుచిక్కని రాజకీయం..!
X

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట ఓ జిల్లా ఏర్పాటు చేయాలని ఉన్నట్టుండి డిమాండ్​ పుట్టుకొచ్చింది. అయితే ఈ డిమాండ్​ ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చింది? ఇందులో ఏమన్నా రాజకీయ కారణాలు ఉన్నాయా? అన్న విషయాలపై ఆసక్తి నెలకొన్నది. నిజానికి సీఎం కేసీఆర్​ ఇప్పటికే తెలంగాణలోనూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇన్ని జిల్లాలు అవసరమా? అన్న ప్రశ్నకూడా తలెత్తింది.

తాజాగా మరోసారి పీవీ నరసింహారావు పేరిట ఓ జిల్లా ఏర్పాటు చేయాలన్న అంశం తెరమీదకు వచ్చింది. ఇటీవల రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్​ నియోజకవర్గమైన హుజురాబాద్​ను పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్​ వినిపిస్తున్నది. ఈ జిల్లాకు పీవీ పేరు పెట్టాలని.. అంతేకాక పీవీ స్వగ్రామమైన వంగరను ఈ జిల్లాలో కలపాలని కొందరు డిమాండ్​ చేస్తున్నారు. అయితే ఈటల రాజేందర్​కు హుజురాబాద్​లో చెక్​ పెట్టేందుకు టీఆర్​ఎస్​ వర్గాలే ఇటువంటి ప్రతిపాదనలు తెరమీదకు తీసుకొచ్చారని సమాచారం.

ఓ వైపు పీవీకి గుర్తింపు తెచ్చినట్టు ఉంటుంది. మరోవైపు ఈటల రాజేందర్​కు రాజకీయంగా చెక్​ పెట్టినట్టు ఉంటుందని సీఎం కేసీఆర్​కు కూడా ఆలోచన వచ్చినట్టు సమాచారం. హుజురాబాద్‌ జిల్లా ఏర్పాటుకు 12 మండలాలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పీవీ గ్రామమైన వంగరకు 8 కిలోమీటర్ల దూరంలోని హుజురాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించి అందులోకి వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌ మండలాలు, కరీంనగర్‌ జిల్లాలోని హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, శం కరపట్నం, సైదాపూర్, చిగురుమామిడితో పాటుగా భీమదేవరపల్లి మండల పరిధిలోని పీవీ స్వగ్రామం వంగర, వీరభద్రస్వామి దేవస్థానం కలిగిన కొత్తకొండను మండలాలుగా ఏర్పాటు చేసి మొత్తం 12 మండలాలతో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కొందరు డిమాండ్​ వినిపిస్తున్నారు.

ఈటల రాజేందర్​ రాజీనామా చేయడంతో ఆయనకు హుజురాబాద్​ నియోజవర్గంలో కొంత సానుభూతి ఉంటుంది. ఈ క్రమంలో ఈటలకు చెక్​ పెట్టేందుకు ఈ కొత్త జిల్లా ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చినట్టు సమాచారం. అన్ని అనూకూలిస్తే పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా జూన్​ 28 న కొత్త జిల్లాను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. సీఎం కేసీఆర్​ రాజకీయ అడుగులు, వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. ఇది కూడా అందులో భాగమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

First Published:  7 Jun 2021 2:32 AM GMT
Next Story