Telugu Global
National

కోవాగ్జిన్​​ కాదు.. కోవిషీల్డే బాగా పనిచేస్తుందట.. సంచలన రిపోర్ట్​..!

దేశీయ టెక్నాలజీతో తయారైన కోవాగ్జిన్​​​ బాగా పనిచేస్తుందా? లేదంటే విదేశీ టెక్నాలజీతో మన దేశంలో తయారైన కోవిషీల్డ్​ బాగా పనిచేస్తుందా? చాలా రోజులుగా మనదేశ ప్రజలను ప్రశ్నగా మారింది. కోవాగ్జిన్​​​ ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని వార్తలు రావడంతో ప్రజలు దాని కోసం ఎగబడ్డారు. అయితే ఇప్పటివరకు డబ్ల్యూహెచ్ వో కోవాగ్జిన్​​​కు గుర్తింపు ఇవ్వలేదు. మరోవైపు కోవాగ్జిన్​​​ వేసుకున్న వాళ్లు తమ దేశానికి రావడానికి వీళ్లేందంటూ అమెరికా ఆంక్షలు విధించింది. కోవిషీల్డ్​ తీసుకున్న భారతీయులకు మాత్రమే అనుమతి ఇచ్చింది అమెరికా.. […]

కోవాగ్జిన్​​ కాదు.. కోవిషీల్డే బాగా పనిచేస్తుందట.. సంచలన రిపోర్ట్​..!
X

దేశీయ టెక్నాలజీతో తయారైన కోవాగ్జిన్​​​ బాగా పనిచేస్తుందా? లేదంటే విదేశీ టెక్నాలజీతో మన దేశంలో తయారైన కోవిషీల్డ్​ బాగా పనిచేస్తుందా? చాలా రోజులుగా మనదేశ ప్రజలను ప్రశ్నగా మారింది. కోవాగ్జిన్​​​ ఎఫెక్టివ్​గా పనిచేస్తుందని వార్తలు రావడంతో ప్రజలు దాని కోసం ఎగబడ్డారు.

అయితే ఇప్పటివరకు డబ్ల్యూహెచ్ వో కోవాగ్జిన్​​​కు గుర్తింపు ఇవ్వలేదు. మరోవైపు కోవాగ్జిన్​​​ వేసుకున్న వాళ్లు తమ దేశానికి రావడానికి వీళ్లేందంటూ అమెరికా ఆంక్షలు విధించింది. కోవిషీల్డ్​ తీసుకున్న భారతీయులకు మాత్రమే అనుమతి ఇచ్చింది అమెరికా.. దీంతో మరోసారి కోవిషీల్డ్​ బాగా పనిచేస్తుందంటూ ప్రచారం ఊపందుకున్నది.

ఈ నేపథ్యంలో ఈ రెండు వ్యాక్సిన్లు ప్రభావంతంగానే పనిచేస్తున్నాయని.. మరణాల రేటును గణనీయంగా తగ్గిస్తాయని.. వ్యాక్సిన్​ తీసుకున్న వాళ్లకు కరోనా సోకినా.. అంతగా ప్రభావం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. అయినప్పటికీ ప్రజల్లో సందేహాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. తాజాగా ఇప్పుడో అధ్యయనం వెలుగులోకి వచ్చింది.

ఈ అధ్యయనం ప్రకారం.. కోవాగ్జిన్​​​ కంటే కోవిషీల్డ్​ ప్రభావంతంగా పనిచేస్తుందని తెలిసింది. హైదరాబాద్​కు చెందిన భారత్​ బయోటెక్​ స్వదేశీ టెక్నాలజీతో కోవాగ్జిన్​​​ ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఇక పూణేకు చెందిన సీరం ఇన్​స్టిట్యూట్​.. ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ రూపొందించిన కోవిషీల్డ్​ను తయారుచేస్తున్నది. ఈ రెండు వ్యాక్సిన్ల పనితీరుపై తాజాగా ఓ సంస్థ అధ్యయనం జరిపింది.

ఈ సంస్థ మొత్తం 515 మందిలో కోవాగ్జిన్​​​, కోవిషీల్డ్​ ఎలా పనితీరు ఎలా ఉంది? అనే విషయం మీద అధ్యయనం జరిపింది. వారిలో వ్యాక్సిన్​ తీసుకున్న తర్వాత యాంటీబాడీస్​ ఏ మేరకు వృద్ధి చెందాయి. అనే విషయం మీద పరిశోధన జరిపింది. అయితే కోవిషీల్డ్​ తీసుకున్న వారిలో 98.1 శాతం యాంటిబాడీస్​, రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందగా.. కోవాగ్జిన్​​​ తీసుకున్న వారిలో 80 శాతం మంది యాంటీబాడీస్​ అభివృద్ధి చెందాయి. అయితే కోవాగ్జిన్​​ ​తో పోల్చిచూస్తే.. కోవిషీల్డ్​ ప్రభావవంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్త ఏకే సింగ్ అంటున్నారు.

First Published:  7 Jun 2021 1:19 AM GMT
Next Story