Telugu Global
NEWS

పదే పదే నా ప్రస్తావన తేవడం.. ఈటల భావ దారిద్య్రమే..! హరీశ్​ కౌంటర్​

ఇటీవల టీఆర్​ఎస్​కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్​.. హరీశ్​రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజీనామా సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. టీఆర్​ఎస్​లో హరీశ్​రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని.. విధిలోని పరిస్థితుల్లోనే ఆయన ఇంకా టీఆర్​ఎస్​లో కొనసాగుతున్నారంటూ ఈటల వ్యాఖ్యానించారు. అయితే ఈటల రాజేందర్​ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్​ రావు స్పందించారు. ‘ఈటల రాజేందర్​ పదే పదే నా పేరు ప్రస్తావించడం ఆయన భావ దారిద్య్రానికి పరాకష్ట. నా […]

పదే పదే నా ప్రస్తావన తేవడం.. ఈటల భావ దారిద్య్రమే..! హరీశ్​ కౌంటర్​
X

ఇటీవల టీఆర్​ఎస్​కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్​.. హరీశ్​రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజీనామా సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. టీఆర్​ఎస్​లో హరీశ్​రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని.. విధిలోని పరిస్థితుల్లోనే ఆయన ఇంకా టీఆర్​ఎస్​లో కొనసాగుతున్నారంటూ ఈటల వ్యాఖ్యానించారు.

అయితే ఈటల రాజేందర్​ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్​ రావు స్పందించారు. ‘ఈటల రాజేందర్​ పదే పదే నా పేరు ప్రస్తావించడం ఆయన భావ దారిద్య్రానికి పరాకష్ట. నా భూజాల మీద తుపాకి పెట్టి పేల్చాలనుకున్నారు. నేను ఎప్పటికీ టీఆర్​ఎస్​ కార్యకర్తనే. నా అధినేత కేసీఆరే. ఆయన ఆజ్ఞలను తుచ తప్పకుండా పాటిస్తాను. ఈటల పార్టీలోనుంచి వెళ్లిపోవడం ఆయన వ్యక్తిగత నిర్ణయం.

అందుకు ఇతరులను వాడుకోవాలనుకోవడమే విడ్డూరం. తా చెడ్డ కోతి.. వనమల్లా చెరిచింది అన్నట్టుగా ఉంది ఈటల వ్యవహారం. ఈటల టీఆర్ఎస్​ నుంచి పోయినా.. పార్టీకి ఎటువంటి నష్టం లేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నేను టీఆర్​ఎస్​లో ఉంటా. ఈటల తన వ్యాఖ్యలకు నైతిక బలం కోసం నా పేరు పదే పదే ప్రస్తావించారు.

సీఎం కేసీఆర్​ నాకు తండ్రితో సమానం. నా గురువు, మార్గదర్శి కూడా ఆయనే. కేసీఆర్​ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తా’ అంటూ హరీశ్​ రావు ఈటల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.మరోవైపు ఈటల రాజేందర్​పై టీఆర్​ఎస్​లోని కొందరు నేతలు సైతం ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఆయన తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతున్నారని వ్యాఖ్యానించారు.

First Published:  5 Jun 2021 10:34 PM GMT
Next Story