Telugu Global
National

వెంకయ్యనాయుడు వర్సెస్​ ట్విట్టర్​ .. ఏంటీ బ్లూ టిక్​ వివాదం..!

ప్రముఖ సోషల్​ మీడియా సంస్థ ట్విట్టర్​.. కేంద్ర ప్రభుత్వం మధ్య గత కొంతకాలంగా వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే శనివారం ట్విట్టర్​ సంస్థ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్​ అకౌంట్ కు బ్లూ టిక్స్​ తొలగించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే మళ్లీ పునరుద్ధరించింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. సాధారణంగా ఏదైనా అకౌంట్​ వెరిఫైడ్​ అని చెప్పేందుకు బ్లూటిక్స్​ను పెడతారు. నెటిజన్లు కూడా ఈ బ్లూటిక్స్​ ఆధారంగానే వెరిఫైడ్​ అకౌంటా కాదా? […]

వెంకయ్యనాయుడు వర్సెస్​ ట్విట్టర్​ .. ఏంటీ బ్లూ టిక్​ వివాదం..!
X

ప్రముఖ సోషల్​ మీడియా సంస్థ ట్విట్టర్​.. కేంద్ర ప్రభుత్వం మధ్య గత కొంతకాలంగా వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే శనివారం ట్విట్టర్​ సంస్థ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్​ అకౌంట్ కు బ్లూ టిక్స్​ తొలగించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే మళ్లీ పునరుద్ధరించింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.

సాధారణంగా ఏదైనా అకౌంట్​ వెరిఫైడ్​ అని చెప్పేందుకు బ్లూటిక్స్​ను పెడతారు. నెటిజన్లు కూడా ఈ బ్లూటిక్స్​ ఆధారంగానే వెరిఫైడ్​ అకౌంటా కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకుంటారు. ఇదిలా ఉంటే వెంకయ్యనాయుడు అకౌంట్​కు బ్లూ టిక్స్​ తొలగించడం.. వివాదాస్పదమైంది. సాధారణంగా చాలా కాలం పాటు ఖాతాను ఉపయోగించకపోవడం వల్ల బ్లూ టిక్స్​ ను తొలగించినట్టు ట్విట్టర్​ ప్రతినిధులు తెలిపారు.

ఈ ఖాతా నుంచి జూలై 23, 2020 లో వెంకయ్యనాయుడు చివరి ట్వీట్ చేశారు. ఆతర్వాత ఉపయోగించలేదు. దీంతో నిబంధనల ప్రకారం బ్లూ టిక్స్​ తొలగించినట్టు ఆ సంస్థ అధికారులు తెలిపారు. అయితే ఆ వెంటనే మళ్లీ ఎందుకు పునరుద్ధరించారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్​ పక్షపాత ధోరణిని అవలంబిస్తోందని వారు ఆరోపించారు.

ఎవరిదైనా నకిలీ అకౌంట్​ అని తేలితే కూడా అన్​వెరిఫైడ్​ చేస్తారు. అయితే ఏకంగా ఉప రాష్ట్రపతి విషయంలో ఇలా జరగడం గమనార్హం. డిజిటల్​ మీడియాలో డేటా నియంత్రణ కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల విషయంలో ట్విట్టర్​, కేంద్ర ప్రభుత్వం మధ్య కొద్ది రోజులుగా వార్​ సాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన రూల్స్​తో వినియోగదారుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ట్విట్టర్​ వాదిస్తున్నది. ఆ విష‌యం కేంద్రానికి కోపం తెప్పించింది.

మరోవైపు ఇటీవల కాంగ్రెస్​ టూల్​ వ్యవహారంలో బీజేపీ నేతల ట్వీట్లకు ట్విట్టర్​ నకిలీ మీడియా అని మార్కు చేయడం కూడా వివాదాస్పదం అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రోల్స్​ జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలపై చర్యలకు పూనుకున్నది. ఈ క్రమంలో ఉప రాష్ట్రపతి అకౌంట్​కు బ్లూ టుక్స్​ తొలగించడం వివాదాస్పదమైంది.

First Published:  5 Jun 2021 2:46 AM GMT
Next Story