Telugu Global
NEWS

ఆనందయ్య 'ఐడ్రాప్స్' కి అనుమతి లేనట్టే..

కరోనా నివారణకోసం అంటూ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేస్తున్న మందుల్లో కంట్లో వేసే చుక్కలమందుకి హైకోర్టు అనుమతి ఇవ్వలేమని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో అభ్యంతరం చెప్పడంతో తగిన ఉత్తర్వులిచ్చేంత వరకు ఆ విషయం పక్కనపెట్టాలని చెప్పింది కోర్టు ఐడ్రాప్సే కీలకం.. ఆనందయ్య పంపిణీ చేసే మందుల్లో కరోనా సోకకుండా ఉండేందుకు ఒకరకం, కరోనా వచ్చినా లక్షణాలు లేనివారికి ఇంకోరకం, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడేవారికి మరో రకమైన మందులు ఉన్నాయి. […]

ఆనందయ్య ఐడ్రాప్స్ కి అనుమతి లేనట్టే..
X

కరోనా నివారణకోసం అంటూ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేస్తున్న మందుల్లో కంట్లో వేసే చుక్కలమందుకి హైకోర్టు అనుమతి ఇవ్వలేమని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో అభ్యంతరం చెప్పడంతో తగిన ఉత్తర్వులిచ్చేంత వరకు ఆ విషయం పక్కనపెట్టాలని చెప్పింది కోర్టు

ఐడ్రాప్సే కీలకం..
ఆనందయ్య పంపిణీ చేసే మందుల్లో కరోనా సోకకుండా ఉండేందుకు ఒకరకం, కరోనా వచ్చినా లక్షణాలు లేనివారికి ఇంకోరకం, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడేవారికి మరో రకమైన మందులు ఉన్నాయి. ఇక ఆక్సిజన్ తప్పనిసరి అయినవారికి, పల్స్ రేటు పడిపోతూ.. కోమా దశకు చేరుకుంటున్నవారికి చుక్కలమందు ఆయన ఇచ్చేవారు. కంట్లో ఈ చుక్కల మందు వేస్తే, క్షణాల్లో పేషెంట్లు లేచి కూర్చున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. అదే సమయంలో రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య లాంటి వారు.. చుక్కల మందుతో అంతా బాగుందని చెప్పి, ఆ తర్వాత ఆరోగ్యం విషమించి చనిపోయిన ఉదాహరణలూ ఉన్నాయి. ఆనందయ్య పంపిణీ చేసే మందుల్లో ఐ డ్రాప్స్ కే ఎక్కువ ప్రచారం లభించింది.

ఆనందయ్య మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం, హైకోర్టు అనుమతి ఇచ్చినా, ఐ డ్రాప్స్ విషయాన్ని మాత్రం పక్కనపెట్టాయి. తాజాగా హైకోర్టులో జరిగిన విచారణలో కూడా ఈ విషయంపై చిక్కుముడి వీడలేదు. ఆనందయ్య ఐ డ్రాప్స్‌ పరిశుభ్ర వాతావరణంలో తయారు కావట్లేదని నిపుణుల కమిటీ తేల్చినందున, కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని అందువల్ల ప్రస్తుతానికి ఐ డ్రాప్స్‌ పంపిణీకి అనుమతినివ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకి నివేదించింది. పూర్తిస్థాయి పరీక్షల నిమిత్తం గరిష్టంగా 3నెలల సమయం పడుతుందని చెప్పింది ప్రభుత్వం. ఐ డ్రాప్స్‌ భద్రత, సమర్థత చాలా ముఖ్యమని, గుజరాత్‌ లో ఇలాంటి చుక్కల మందు తయారీ పంపిణీని అక్కడి హైకోర్టు ఆపేసిందనే విషయాన్ని కేంద్రం తరపు న్యాయవాది ఈ సందర్భంగా ప్రస్తావించారు. జరగరానిది జరిగితే అందుకు కోర్టును నిందించే పరిస్థితి ఉండకూడదని ఆయన అన్నారు.

ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా, తమంత తాముగా ఐ డ్రాప్స్‌ కోసం వచ్చేవారికి అడ్డు చెప్పకుండా ఉండే అంశాన్ని పరిశీలించాలని కోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే ఐ డ్రాప్స్ కోసం రోగులు ఆనందయ్య వద్దకే రావాల్సి ఉంటుందని, గతంలో రోగులు ఇలా కష్ణపట్నంకి క్యూ కట్టడంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని, మరోసారి రోగులంతా అక్కడికి వస్తే పరిస్థితి అదుపు చేయలేమని ప్రభుత్వం తెలిపింది. ఐ డ్రాప్స్‌ పంపిణీకి హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలివ్వాలనుకుంటే ఇవ్వొచ్చునని తెలిపింది. దీంతో ఐ డ్రాప్స్‌ పంపిణీ విషయంలో తగిన ఉత్తర్వులిస్తామని పేర్కొంటూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

మరోవైపు కృష్ణపట్నంలోని పోర్ట్ ప్రాంతంలో ఆనందయ్య తన మందు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. వచ్చేవారం మందు పంపిణీ ఉంటుందని చెబుతున్నారు. ఆన్ లైన్లో ఆర్డర్ ఇచ్చి మందుని కొరియర్ ద్వారా తెప్పించుకునే వెసులుబాటు ఉంటుందని, తొందరపడి ఎవరూ కృష్ణపట్నం రావొద్దని నెల్లూరు జిల్లా అధికారులు చెబుతున్నారు.

First Published:  3 Jun 2021 9:10 PM GMT
Next Story