Telugu Global
International

ప్రపంచంలో తొలిసారి.. మనిషికి సోకిన బర్డ్​ఫ్లూ..!

బర్డ్​ఫ్లూ కోళ్లకు సోకే ఓ వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో పక్షులు బర్డ్​ఫ్లూకు బలవుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మన దేశంలోనూ ఈ వ్యాధి కలకలం సృష్టించింది. కొన్ని రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ దివాలా తీసింది. అయితే బర్డ్​ఫ్లూ మనుషులకు కూడా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పేవారు. అయితే ఇంతవరకు ప్రపంచంలో ఒక్క బర్డ్​ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదు. కానీ తొలిసారిగా చైనాలో ఓ వ్యక్తికి బర్డ్​ఫ్లూ సోకింది. ఈ విషయాన్ని […]

ప్రపంచంలో తొలిసారి.. మనిషికి సోకిన బర్డ్​ఫ్లూ..!
X

బర్డ్​ఫ్లూ కోళ్లకు సోకే ఓ వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో పక్షులు బర్డ్​ఫ్లూకు బలవుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మన దేశంలోనూ ఈ వ్యాధి కలకలం సృష్టించింది. కొన్ని రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ దివాలా తీసింది. అయితే బర్డ్​ఫ్లూ మనుషులకు కూడా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పేవారు. అయితే ఇంతవరకు ప్రపంచంలో ఒక్క బర్డ్​ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదు. కానీ తొలిసారిగా చైనాలో ఓ వ్యక్తికి బర్డ్​ఫ్లూ సోకింది. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వమే ప్రకటించింది.

చైనా ఆరోగ్య కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) ఈ విషయంపై ఓ ప్రకటన చేసింది. తమ దేశంలో హెచ్‌10ఎన్‌3 స్ట్రెయిన్‌ వ్యాపించిందని వెల్లడించింది. చైనాలోని తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్‌ నగరానికి చెందిన 41 ఏళ్ల పురుషుడికి బర్డ్‌ ఫ్లూ సోకింది. ప్రపంచంలోనే తొలిసారిగా బర్డ్‌ ఫ్లూ కేసు తమ దేశంలోనే మానవుడికి సోకిందని కమిషన్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఈ మేరకు వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) వారం కింద రక్త పరీక్షలు చేయగా బర్డ్​ఫ్లూ సోకిన విషయం నిర్ధారణ అయ్యింది. తమ దేశంలో బర్డ్​ఫ్లూ సోకడంతో చైనా ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సదరు వ్యక్తి ఎవరెవరిని కలిశారు. తదితర విషయాలను ఆరాతీస్తున్నది. బర్డ్​ఫ్లూ కోళ్లు లేదా పక్షుల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉంటుంది.

అయితే మనుషుల నుంచి మనుషులకు కూడా ఓ వ్యాధి సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఇంకా ఎవరికైనా బర్డ్​ఫ్లూ సోకిందా? తదితర విషయాలపై చైనా ప్రభుత్వం ఆరా తీస్తున్నది.

First Published:  2 Jun 2021 2:36 AM GMT
Next Story