Telugu Global
International

మనదేశంలో పుట్టిన స్ట్రెయిన్​కు పేరుపెట్టిన డబ్ల్యూహెచ్​వో..!

కరోనా సెకండ్​వేవ్​లో మనదేశంలో విపరీతమైన కేసులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సెకండ్​వేవ్ సందర్భంగా మనదేశంలో కొత్త స్ట్రెయిన్​ వెలుగుచూసినట్టు ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. అందుకనుగుణంగానే భారత్​లో ఏర్పడ్డ స్ట్రెయిన్​కు ఇండియన్​ స్ట్రెయిన్​గా పేరు పెట్టాయి ప్రపంచదేశాలు. దేశంలో పుట్టిన వైరస్​కు ‘ఇండియన్​ స్ట్రెయిన్​’ గా పేరు పెట్టడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. దీంతో తాజాగా ఈ విషయంపై డ‌బ్ల్యూహెచ్ఓ స్పందించింది. దేశాల పేరుతో కరోనా స్ట్రెయిన్​కు పేరు పెట్టడం సరికాదని డ‌బ్ల్యూహెచ్ఓ […]

మనదేశంలో పుట్టిన స్ట్రెయిన్​కు పేరుపెట్టిన డబ్ల్యూహెచ్​వో..!
X

కరోనా సెకండ్​వేవ్​లో మనదేశంలో విపరీతమైన కేసులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సెకండ్​వేవ్ సందర్భంగా మనదేశంలో కొత్త స్ట్రెయిన్​ వెలుగుచూసినట్టు ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. అందుకనుగుణంగానే భారత్​లో ఏర్పడ్డ స్ట్రెయిన్​కు ఇండియన్​ స్ట్రెయిన్​గా పేరు పెట్టాయి ప్రపంచదేశాలు. దేశంలో పుట్టిన వైరస్​కు ‘ఇండియన్​ స్ట్రెయిన్​’ గా పేరు పెట్టడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.

దీంతో తాజాగా ఈ విషయంపై డ‌బ్ల్యూహెచ్ఓ స్పందించింది. దేశాల పేరుతో కరోనా స్ట్రెయిన్​కు పేరు పెట్టడం సరికాదని డ‌బ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. భార‌త్‌లో వెలుగుచూసిన డ‌బుల్ మ్యుటెంట్ వేరియంట్​కు డ‌బ్ల్యూహెచ్ఓ పేరుపెట్టింది. మనదేశంలో ఏర్పడ్డ వేరియంట్​కు ‘డెల్టా’ గా పేరు పెడుతూ.. డ‌బ్ల్యూహెచ్ఓ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. అంత‌క‌ముందు గుర్తించిన మ‌రో వేరియంట్‌కు ‘క‌ప్పా’ గా పేరుపెట్టారు.

భారత్‌లో ప్రస్తుతం బీ1.617 వేరియంట్ విజృంభిస్తున్నది. దీన్ని తొలిసారిగా మనదేశంలో అక్టోబరులో గుర్తించారు. దీనికి ‘డెల్టా’ అని నామ‌క‌ర‌ణం చేశారు. ఇక మ‌రో వేరియంట్‌కు ‘క‌ప్పా’ అని డ‌బ్ల్యూహెచ్ఓ పేరుపెట్టింది. ప్రపంచంలోకి ఏదైనా కొత్త వైరస్​ లేదా అవి రూపాంతరం చెందినప్పుడు వాటికి కచ్చితంగా శాస్త్రీయ నామాలు పెట్టాలని డ‌బ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. భవిష్యత్​లో చేసే పరిశోధనలకు ఈ పేర్లు ఉపయోగపడతాయని పేర్కొన్నది.

కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన విషయం తెలిసిందే. తొలుత చైనాలోని వూహాన్​లో కరోనా పుట్టింది. అయితే ఈ వైరస్​ వివిధ దేశాల్లో వివిధ రకాలుగా రూపాంతరం చెందుతున్నది. గతంలో దక్షిణాఫ్రికా, బ్రిటన్​లోనూ కొత్త తరహా వేరియంట్లు వెలుగుచూశాయి. తాజాగా భారత్​లోనూ మరో కొత్త తరహా వేరియంట్​ కనిపించింది. ప్రస్తుతం మనదేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కానీ వ్యాక్సినేషన్​ ప్రక్రియ మాత్రం ముమ్మరంగా సాగడం లేదు. మరోవైపు థర్డ్​వేవ్​ వస్తుందంటూ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొన్నది.

First Published:  1 Jun 2021 1:01 AM GMT
Next Story