Telugu Global
NEWS

కక్షతోనే రఘురామ పిటిషన్​.. దాన్ని కొట్టేయండి

అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్​ మోహన్​రెడ్డి బెయిల్​ రద్దు చేయాలని కోరుతూ.. వైసీపీ రెబల్​ ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్​కు కౌంటర్​ దాఖలు చేయాలని గతంలోనే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తాజాగా ఈ పిటిషన్​పై నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్​ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. సీఎం జగన్​ అసలు బెయిల్​ నిబంధనలు […]

కక్షతోనే రఘురామ పిటిషన్​.. దాన్ని కొట్టేయండి
X

అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్​ మోహన్​రెడ్డి బెయిల్​ రద్దు చేయాలని కోరుతూ.. వైసీపీ రెబల్​ ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్​కు కౌంటర్​ దాఖలు చేయాలని గతంలోనే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో తాజాగా ఈ పిటిషన్​పై నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్​ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. సీఎం జగన్​ అసలు బెయిల్​ నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. రఘురామ పిటిషన్​కు అసలు విచారణ అర్హత లేదని ఆయన పేర్కొన్నారు. కేవలం వ్యక్తిగత కక్ష కోసమే ఈ పిటిషన్​ దాఖలు చేశారని పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థలను తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందని జగన్​ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్​ను కొట్టేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈనెల 14 కు విచారణను వాయిదా వేసింది. మరోవైపు రఘురామ వ్యవహారం ఏపీలో హాట్​ టాపిక్​గా మారిన విషయం తెలిసిందే. వైసీపీ తరఫున ఎంపీగా గెలుపొందిన రఘురామ కృష్ణరాజు.. గత కొన్ని నెలలుగా జగన్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఓ దశలో ఆయన సీఎం జగన్​పై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేశారు. ఓ కులాన్ని టార్గెట్​ చేస్తూ సంచనల వ్యాఖ్యలు చేశారు.

దీంతో రఘురామ కృష్ణరాజుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేయడం.. ఆ కేసు సుప్రీంకోర్టుకు దాకా వెళ్లడం తెలిసిందే. ఇదిలా ఉండగా రఘురామ దాఖలు చేసిన పిటిషన్​పై నేడు విచారణ సాగింది.

First Published:  1 Jun 2021 9:24 AM GMT
Next Story