Telugu Global
Cinema & Entertainment

కార్తికేయ-2 నుంచి మరో పోస్టర్

నిఖిల్ కు స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమా కార్తికేయ. ఈ మూవీతో యానిమ‌ల్ హిప్న‌టిజం అనే కొత్త కాన్సెప్ట్‌ని తెలుగుకి ప‌రిచ‌యం చేశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా వస్తోంది కార్తికేయ 2. ఎలాంటి స్క్రిప్ట్ తీసుకున్నా కూడా సామాన్య‌ ప్రేక్ష‌కుడికి కూడా అర్థ‌మ‌య్యేలా, అల‌రించేలా త‌న పెన్ కి ప‌నిపెట్టే ద‌ర్శ‌కుడు చందు మెుండేటి మ‌రొక్క‌సారి మ‌న‌కి తెలియ‌ని కొత్త క‌థతో వస్తున్న చిత్రం కార్తికేయ‌2. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ […]

కార్తికేయ-2 నుంచి మరో పోస్టర్
X

నిఖిల్ కు స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమా కార్తికేయ. ఈ మూవీతో యానిమ‌ల్ హిప్న‌టిజం అనే కొత్త
కాన్సెప్ట్‌ని తెలుగుకి ప‌రిచ‌యం చేశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా వస్తోంది కార్తికేయ 2. ఎలాంటి స్క్రిప్ట్
తీసుకున్నా కూడా సామాన్య‌ ప్రేక్ష‌కుడికి కూడా అర్థ‌మ‌య్యేలా, అల‌రించేలా త‌న పెన్ కి ప‌నిపెట్టే
ద‌ర్శ‌కుడు చందు మెుండేటి మ‌రొక్క‌సారి మ‌న‌కి తెలియ‌ని కొత్త క‌థతో వస్తున్న చిత్రం కార్తికేయ‌2.

పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ
చిత్రం షూటింగ్ చాలా వరకు పూర్తయింది. హిమాచల్ ప్రదేశ్ లోని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్
చేశారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించిన వివ‌రాల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు.

తాజాగా కార్తికేయ 2 నుంచి మరో పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. హీరో నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన
బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. గ‌తంలో కార్తికేయ 2కి సంబంధించిన కాన్సెప్ట్ మోష‌న్ పోస్టర్‌కి
అనూహ్య స్పంద‌న ల‌భించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా నిఖిల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో
ముగ్ధ అనే పాత్రలో నటిస్తోంది అనుపమ పరమేశ్వరన్.

First Published:  1 Jun 2021 7:17 AM GMT
Next Story