Telugu Global
NEWS

ఆన్ లైన్ లోనూ ఆనందయ్య మందు..

ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతించడంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వనమూలికలు, ఇతర ద్రవ్యాలు సేకరిస్తున్నారు. ఈ దఫా మందు పంపిణీలో కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. కరోనా రోగులెవరూ మందుకోసం కృష్ణపట్నం రాకూడదు. వారి తరపున ఎవరైనా వస్తే మందు ఇస్తామని చెబుతున్నారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా సహా ఇతర ప్రాంతాల్లో కూడా కౌంటర్ పెట్టి ఆనందయ్య మందు విక్రయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నకిలీల […]

ఆన్ లైన్ లోనూ ఆనందయ్య మందు..
X

ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతించడంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వనమూలికలు, ఇతర ద్రవ్యాలు సేకరిస్తున్నారు. ఈ దఫా మందు పంపిణీలో కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. కరోనా రోగులెవరూ మందుకోసం కృష్ణపట్నం రాకూడదు. వారి తరపున ఎవరైనా వస్తే మందు ఇస్తామని చెబుతున్నారు. అదే సమయంలో నెల్లూరు జిల్లా సహా ఇతర ప్రాంతాల్లో కూడా కౌంటర్ పెట్టి ఆనందయ్య మందు విక్రయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నకిలీల బెడద తట్టుకోడానికి ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోనే మందు పంపిణీ జరిగేట్టు చర్యలు తీసుకంటామంటున్నారు అధికారులు. ఈమేరకు ఆనందయ్య, స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ సమావేశమయ్యారు. తొలి దఫా తమ సొంత నియోజకవర్గ ప్రజలకోసం మందు తయారు చేసి పంపిణీ చేస్తామని చెప్పారు ఆనందయ్య. అనంతరం విస్తృత స్థాయిలో మందు తయారీ మొదలు పెడతానని అన్నారు. మందు పంపిణీకి మరో నాలుగురోజులు సమయం పట్టే అవకాశం ఉందని అంచనా.

ఆన్ లైన్ పద్ధతిలో..
నేరుగా ఆనందయ్య మందుకోసం జనాలు వస్తే అదుపు చేయడం సాధ్యం కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. అందులోనూ కొవిడ్ ప్రొటోకాల్ పాటించడం అస్సలు కుదరని పని. క్యూలైన్లో సామాజిక దూరం పాటించి వేచి చూసి, మందు తీసుకెళ్లడం ఇబ్బందితో కూడుకున్న పని కావడంతో, ఆన్ లైన్ లో కూడా ఆనందయ్య మందు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం ఓ వెబ్ సైట్ రూపొందిస్తున్నట్టు సమాచారం. మందు కావాల్సిన వారు నేరుగా అందులో తమ సమాచారం ఇస్తే వారికి ఉచితంగా మందు పంపిణీ చేస్తారు. డెలివరీ చార్జీలు చెల్లించి ఆ మందు తీసుకోవచ్చు.

మందు పంపిణీకి టీటీడీ వెనకడుగు..
ఆనందయ్య మందుకి ప్రభుత్వం అనుమతి ఇస్తే.. టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేస్తామని ఇదివరకే ప్రకటించినా.. అది సాధ్యం అయ్యేట్టు లేదు. ఈమేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆనందయ్య మందుకి ఆయుర్వేద శాఖ గుర్తింపు లభించలేదని, అందుకే ఆ మందుని టీటీడీ ఆధ్వర్యంలో పంపిణీ చేయట్లేదని ఆయన స్పష్టం చేశారు. గుర్తింపు లేకుండా మందు తయారీ, పంపిణీ సరికాదని, అందుకే టీటీడీ ఆ ప్రయత్నానికి దూరంగా ఉందని వివరించారు. ఆనందయ్య మందులతో కరోనా తగ్గుతుందని తేలలేదని, కేవలం ఆ మందుల్లో హానికర పదార్థాలు లేవని మాత్రమే తేలిందని అన్నారు సుబ్బారెడ్డి.

First Published:  1 Jun 2021 6:41 AM GMT
Next Story