Telugu Global
NEWS

ఏపీలో జూన్ 10వరకు కర్ఫ్యూ పొడిగింపు..

ఏపీలో కర్ఫ్యూని జూన్ 10వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుతున్నా కూడా కర్ఫ్యూ పొడిగింపుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. సడలింపు వేళల్లో మాత్రం మార్పులు లేవని చెప్పారు అధికారులు. ఉదయం 6గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సడలింపు ఉంటుందని, ఆ తర్వాత 144 సెక్షన్ అమలులోకి వస్తుందని తెలిపారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈనెల 5న ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది, 18వరకు నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది. […]

ఏపీలో జూన్ 10వరకు కర్ఫ్యూ పొడిగింపు..
X

ఏపీలో కర్ఫ్యూని జూన్ 10వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుతున్నా కూడా కర్ఫ్యూ పొడిగింపుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. సడలింపు వేళల్లో మాత్రం మార్పులు లేవని చెప్పారు అధికారులు. ఉదయం 6గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సడలింపు ఉంటుందని, ఆ తర్వాత 144 సెక్షన్ అమలులోకి వస్తుందని తెలిపారు.

సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈనెల 5న ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది, 18వరకు నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపింది. ఆ తర్వాత కూడా కరోనా విజృంభణ తగ్గకపోవడంతో 19నుంచి నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించారు. ఇప్పుడు మరోసారి కర్ఫ్యూ ని జూన్ 10వరకు పొడిగించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎస్ ఆదిత్యనాథ్ సహా పలువురు అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రైవేట్ ఆస్పత్రుల బిల్లులపై కీలక నిర్ణయం..
మరోవైపు హైకోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు వీలుగా కోవిడ్ నోడల్ ఆఫీసర్ విధులలో మార్పులు చేర్పులు చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల ఫీజు చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలని స్పష్టం చేసింది. రోగులకు బిల్లులు ఇచ్చేముందు నోడల్ ఆఫీసర్ వాటిపై సంతకం చేయాలని చెప్పింది. నిర్ణయించిన ధరల ప్రకారం బిల్లులు ఇచ్చారా లేదా అని నోడల్ ఆఫీసర్ పరిశీలించి ఆ తర్వాతే వాటిపై సంతకం చేయాలంది. నోడల్ అధికారి సంతకం లేకుండా కోవిడ్ ఆసుపత్రులు ఫీజులు తీసుకోకూడదని స్పష్టం చేసింది. వాస్తవానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సకు.. ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజు మాత్రమే తీసుకోవాల్సి ఉండగా చాలా చోట్ల ఆ నిబంధనను తుంగలో తొక్కేశాయి యాజమాన్యాలు. లెక్కల్లోకి రాకుండా.. చిత్తు కాగితాలపై బిల్లులు రాసిచ్చి వసూలు చేసుకునేవారు. వీటిపై పేషెంట్ పేరు మినహా ఇంకే వివరాలు ఉండవు, వీటిని ఎక్కడా నమోదు కూడా చేసుకోరు కాబట్టి ఆధారాలు ఉండవు. నోడల్ ఆఫీసర్లను మేనేజ్ చేసుకుంటూ ఇలా దోపిడీకి తెగబడే ఆస్పత్రులకు కొత్త రూల్స్ తో చెక్ పడినట్టే చెప్పాలి. బిల్లుపై నోడల్ ఆఫీసర్ సంతకం ఉంటుంది కాబట్టి, అక్రమాలపై బాధితులు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.

First Published:  31 May 2021 5:09 AM GMT
Next Story