Telugu Global
NEWS

కృష్ణపట్నంలో కరోనా కలకలం..

కరోనా నివారణకు ఆయుర్వేద మందు తయారు చేసిన ఆనందయ్య సొంత ఊరిలో కరోనా కేసులు కలకలం రేపాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. మరో 27మందిలో తీవ్రమైన కరోనా లక్షణాలు కనిపించాయి. వారికి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఒకేరోజు, ఒకేఊరిలో దాదాపు 30మందికి కరోనా అంటే ఆందోళనకరమైన విషయమే. అందులోనూ ఆ ఊరు ఆనందయ్య సొంత ఊరు కావడమే […]

కృష్ణపట్నంలో కరోనా కలకలం..
X

కరోనా నివారణకు ఆయుర్వేద మందు తయారు చేసిన ఆనందయ్య సొంత ఊరిలో కరోనా కేసులు కలకలం రేపాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. మరో 27మందిలో తీవ్రమైన కరోనా లక్షణాలు కనిపించాయి. వారికి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఒకేరోజు, ఒకేఊరిలో దాదాపు 30మందికి కరోనా అంటే ఆందోళనకరమైన విషయమే. అందులోనూ ఆ ఊరు ఆనందయ్య సొంత ఊరు కావడమే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఆనందయ్య మందుని కృష్ణపట్నం గ్రామ ప్రజలంతా తీసుకున్నారని, కరోనా వారి దరిచేరలేదని అప్పట్లో సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తింది. నిత్యం పోర్ట్ తో సంబంధం ఉన్న మనుషులు ఊరిలోకి వస్తూ పోతూ ఉన్నా.. కృష్ణపట్నంలో కరోనా జాడ లేదని, దానికి కారణం ఆనందయ్య మందేనంటూ కొన్ని వీడియోలు, ఫోన్ వాయిస్ రికార్డులు వైరల్ అయ్యాయి. ఆనందయ్య మందు కారణంగా ముత్తుకూరు మండలంలోని రెండు మూడు గ్రామాల ప్రజలు మాస్క్లు లేకుండా ధైర్యంగా తిరిగేవారని కూడా అన్నారు. దీంతో రాష్ట్ర ప్రజలంతా కృష్ణపట్నం వాసులు ఎంత అదృష్టం చేసుకున్నారో అని ఆశ్చర్యపోయారు. ఆ ఊరితో పాత బంధుత్వాలు, స్నేహాలు గుర్తు తెచ్చుకుని మరీ ఆనందయ్య మందుకోసం ఫోన్లు చేసేవారు. ఆ తర్వాత ఆనందయ్య మందు పంపిణీ ఆగిపోవడం, కేంద్ర సంస్థ వద్ద అనుమతి పెండింగ్ లో ఉండటం అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు కృష్ణపట్నం ఊరిలో కరోనా కేసులు ఒక్కసారిగా వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఒకే రోజు దాదాపు 30మందికి లక్షణాలు బయటపడటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు ఆనందయ్య మాత్రం ఇంకా సొంత ఊరికి, కుటుంబానికి దూరంగానే ఉన్నారు. పోలీసుల రక్షణ వలయంలో ఆనందయ్య కాలం గడుపుతున్నారు. అటు రాష్ట్ర ఆయుష్ విభాగం ఆనందయ్య మందుతో ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పినా.. కేంద్ర సంస్థ సీసీఆర్ఏఎస్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఆ అనుమతి రాగానే భారీ ఎత్తున మందు తయారు చేయడానికి ఆనందయ్య సిద్ధంగా ఉన్నారు, టీటీడీ లాంటి సంస్థలు కూడా తమ ప్రయత్నాలు మొదలు పెట్టేందుకు రెడీ అంటున్నాయి. ఈ దశలో కృష్ణపట్నంలో కరోనా కలకలం ఆందోళన కలిగిస్తోంది.

First Published:  30 May 2021 9:55 PM GMT
Next Story