Telugu Global
National

కరోనా పరీక్షల్లో మరో విప్లవాత్మక మార్పు..

ఆర్టీపీసీఆర్ అయినా, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష అయినా, ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘కొవిసెల్ఫ్’ హోమ్ కిట్ అయినా.. స్వాబ్ సేకరించాల్సిందే. దూది చుట్టిన ఓ పుల్లని గొంతులోకి కానీ, ముక్కులోకి కానీ చొప్పించి స్వాబ్ సేకరిస్తారు. దాన్ని ల్యాబొరేటరీకి పంపించి వైరస్ నిర్థారణ చేస్తారు. ఇప్పటి వరకూ కొవిడ్ పరీక్షలు ఇలాగే జరిగేవి. ఇకపై స్వాబ్ సేకరించే పనిలేకుండా.. ఒక సులువైన విధానాన్ని కనిపెట్టారు భారత శాస్త్రవేత్తలు. ‘శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి’ (సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో ‘నేషనల్‌ […]

కరోనా పరీక్షల్లో మరో విప్లవాత్మక మార్పు..
X

ఆర్టీపీసీఆర్ అయినా, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష అయినా, ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘కొవిసెల్ఫ్’ హోమ్ కిట్ అయినా.. స్వాబ్ సేకరించాల్సిందే. దూది చుట్టిన ఓ పుల్లని గొంతులోకి కానీ, ముక్కులోకి కానీ చొప్పించి స్వాబ్ సేకరిస్తారు. దాన్ని ల్యాబొరేటరీకి పంపించి వైరస్ నిర్థారణ చేస్తారు. ఇప్పటి వరకూ కొవిడ్ పరీక్షలు ఇలాగే జరిగేవి. ఇకపై స్వాబ్ సేకరించే పనిలేకుండా.. ఒక సులువైన విధానాన్ని కనిపెట్టారు భారత శాస్త్రవేత్తలు. ‘శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి’ (సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో ‘నేషనల్‌ ఎన్విరానిమెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్‌’ (నీరి) శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. ఇది సులువైన విధానమే కాదు, వేగవంతమైనది కూడా అని చెబుతున్నారు.

ఎలా చేస్తారు..?
సెలైన్ గార్గిల్ గా పిలిచే ఈ నూతన విధానం కూడా ఆర్టీపీసీఆర్ పరీక్ష లాంటిదే. అయితే నోరు, ముక్కునుంచి స్వాబ్ తీయాల్సిన అవసరం లేకుండా సెలైన్ ద్రావణాన్ని పుక్కిలించి దాన్ని తిరిగి అదే చిన్న బాటిల్ లో ఉమ్మివేసి ల్యాబ్ కి పంపించాల్సి ఉంటుంది. ల్యాబ్ లో సెలైన్ నీటితో కలసి ఉన్న ఉమ్మికి మరో రసాయనాన్ని కలిపి వేడి చేస్తారు. దీన్ని వేడిచేసినప్పుడు ఆర్ఎన్ఏ టెంప్లేట్ ఒకటి వెలువడుతుంది. దీన్ని పరీక్షించి వైరస్ ని నిర్థారిస్తారు.

ఏంటి ఉపయోగం..?
స్వాబ్ సేకరించడానికి నిపుణుల అవసరం ఉండదు.
స్వాబ్ సేకరించే పరికరాలు అవసరం లేదు.
క్యూలైన్లో నిబలడి వేచి చూడాల్సిన బాధ తప్పుతుంది.
ఎవరికి వారే పరీక్ష చేసుకోవచ్చు.
వ్యర్థాలు బాగా తగ్గిపోతాయి.

సెలైన్ గార్గిల్ విధానం కరోనా పరీక్షల్లో ఓ నూతన ఆవిష్కరణ అని కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ వ్యాఖ్యానించారు. నాగ్ పూర్ కార్పొరేషన్ లో ప్రస్తుతం ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. సెలైన్ గార్గిల్ ద్వారా సేకరించిన ప్లాస్టిక్ బాటిల్స్ ని వైద్యశాఖ సిబ్బంది సేకరించి ల్యాబొరేటరీలకు పంపించి పరీక్ష ఫలితాలు తెలియజేస్తున్నారు. ఇది ఎంతో సులువుగా ఉందని దేశవ్యాప్తంగా దీన్ని అమలులోకి తీసుకొస్తామని అంటున్నారు నేతలు.

First Published:  29 May 2021 4:40 AM GMT
Next Story