Telugu Global
NEWS

ఆత్మవంచన ఇంకెన్నాళ్లు బాబూ..! " విజయసాయి

టీడీపీ మహానాడు జూమ్ కాన్ఫరెన్స్ లపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. పంచాయతీల నుంచి, పార్లమెంట్ వరకు అన్నిచోట్లా ప్రజలు తిరస్కరించడంతో టీడీపీ నేతలంతా జూమ్ సమావేశాలకే పరిమితమయ్యారని. రియల్ మీటింగ్ లు మరచిపోయి, మాక్ మీటింగ్ లంటూ, ఫేక్ మీటింగ్ లతో భ్రమల్లో బతికేస్తున్నారని ఎద్దేవా చేశారు. మహానాడులో టీడీపీ తీర్మానాలపై కూడా విజయసాయిరెడ్డి తనదైన చెణుకులు విసిరారు. “పిల్లల పరీక్షలు కూడా నికృష్టపు ఎజెండాలో చేర్చావేంటి బాబూ? యాన్యువల్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని రంకెలు […]

ఆత్మవంచన ఇంకెన్నాళ్లు బాబూ..!  విజయసాయి
X

టీడీపీ మహానాడు జూమ్ కాన్ఫరెన్స్ లపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. పంచాయతీల నుంచి, పార్లమెంట్ వరకు అన్నిచోట్లా ప్రజలు తిరస్కరించడంతో టీడీపీ నేతలంతా జూమ్ సమావేశాలకే పరిమితమయ్యారని. రియల్ మీటింగ్ లు మరచిపోయి, మాక్ మీటింగ్ లంటూ, ఫేక్ మీటింగ్ లతో భ్రమల్లో బతికేస్తున్నారని ఎద్దేవా చేశారు.

మహానాడులో టీడీపీ తీర్మానాలపై కూడా విజయసాయిరెడ్డి తనదైన చెణుకులు విసిరారు. “పిల్లల పరీక్షలు కూడా నికృష్టపు ఎజెండాలో చేర్చావేంటి బాబూ? యాన్యువల్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని రంకెలు వేస్తున్నావు. మీ కొడుకు అప్రయోజకుడు అయ్యాడని పిల్లల జీవితాలు నాశనం చేయాలని చూస్తున్నావా? మొన్నటి దాకా అన్ని బ్రాండ్ల మద్యం దొరకట్లేదని ఏడ్చావు. ఎవర్ని బాగు చేద్దామనో!” అంటూ ట్విట్టర్ లో ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి.

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఎప్పుడో కనుమరుగైందని. చంద్రబాబు, ఎన్టీఆర్ దగ్గర కొట్టేసిన పార్టీ కూడా ఫినిష్ అయిందని, ఇప్పుడున్న పార్టీ అరెస్టులను ఖండించడం, బెయిళ్లు, స్టేలు సంపాదించడానికే పరిమితమైందని విమర్శించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే కొట్టుకు పోయాక అచ్చెన్నాయుడి మాటలు నిజం కాకుండా ఎలా పోతాయని సెటైర్లు వేశారు.

“ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది. టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైంది. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతావ్ బాబూ? కుప్పంలో ఎందుకు ఖంగుతిన్నావో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో ఆ జూమ్ నాడులో ఏడవండి. ఇంకెంతకాలం ఈ ఆత్మవంచన?” అని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన పచ్చ పాలన ప్రజలకు ఇంకా గుర్తుందని, కరోనా కష్టకాలంలో వైద్యంకోసం కాకుండా, పబ్లిసిటీకోసం టీడీపీ నేతలు అధికారులపై ఊగిపోతున్నారని మండిపడ్డారు. యువ సీఎంను దేశమంతా అనుసరిస్తుంటే.. టీడీపీ విజనరీ ఒక్కడే ఏడుస్తున్నాడని అన్నారు.

First Published:  27 May 2021 8:45 PM GMT
Next Story