Telugu Global
National

కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం క్లారిటీ..

కోవిడ్ వ్యాక్సినేషన్ కొంతకాలంగా అంతత మాత్రంగా జ‌రుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అది కూడా లేదు. దాంతో వ్యాక్సిన్స్ పై చాలా అపోహలు నెలకొన్నాయి. అసలు వ్యాక్సిన్స్ ఇస్తారా..? ఇవ్వరా..? అన్న సందేహాల‌తో పాటు వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీటిపై స్పందిస్తూ నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. విదేశీ వ్యాక్సిన్లను కొనడంలో కేంద్రం లేట్ చేస్తుందన్న వాదనలకు స్పందిస్తూ.. కరోనా వ్యాక్సిన్‌ను […]

కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కేంద్రం క్లారిటీ..
X

కోవిడ్ వ్యాక్సినేషన్ కొంతకాలంగా అంతత మాత్రంగా జ‌రుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అది కూడా లేదు. దాంతో వ్యాక్సిన్స్ పై చాలా అపోహలు నెలకొన్నాయి. అసలు వ్యాక్సిన్స్ ఇస్తారా..? ఇవ్వరా..? అన్న సందేహాల‌తో పాటు వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీటిపై స్పందిస్తూ నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ ఓ ప్రకటన రిలీజ్ చేశారు.

విదేశీ వ్యాక్సిన్లను కొనడంలో కేంద్రం లేట్ చేస్తుందన్న వాదనలకు స్పందిస్తూ.. కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడం కోసం ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, మోడెర్నా లాంటి ఇంటర్నేషనల్ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. విదేశీ సంస్థల నుంచి వాటిని కొనుగోలు చేయడం అంత తేలికైన విషయం కాదు. స్థానిక అవసరాలకు అనుగుణంగా వారి ప్రాధాన్య‌త‌లు వేరుగా ఉంటాయని, త్వరలోనే ఫైజర్ వ్యాక్సిన్స్ ను దిగుమతి చేసుకునే చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

దేశీయ వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయడం లేదన్న వాదనలకు స్పందిస్తూ.. ప్రస్తుతం దేశంలో స్వదేశీ వ్యాక్సిన్ల ఉత్పత్తి జరుగుతుందని, భారత్‌ బయోటెక్‌ తో పాటు, మరో మూడు కంపెనీల్లో కోవాక్జిన్ ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. అక్టోబర్‌ నాటికి నెలకు 10కోట్ల కోవాక్జిన్, 11 కోట్ల కోవీషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి జరుగుతుందని, వీటితో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థతో కలిసి ఉత్పత్తి మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇవే కాకుండా దేశీయ సంస్థలైన జైడస్‌ క్యాడిలా, బయోలాజికల్‌ ఈ, జెన్నోవాలు చేస్తోన్న వ్యాక్సిన్‌ అభివృద్ధికి కేంద్రం సహాయం చేస్తోందని చెప్పుకొచ్చారు.

వ్యాక్సిన్స్ విషయంలో కేంద్రం తన బాధ్యతను రాష్ట్రాలకు వదిలివేసిందన్న వాదనలకు బదులిస్తూ.. దేశంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే వ్యాక్సిన్లు అందిస్తున్న విషయం ఆయా రాష్ట్రాలకు తెలుసన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే వ్యాక్సిన్‌ విధానాన్ని సరళీకరించామని, దీంతో ఆయా రాష్ట్రాలకు స్వేచ్ఛ పెరిగిందని, గ్లోబల్‌ టెండర్లు ఎలాంటి ఫలితాలు ఇవ్వవని.. మొదటి నుంచి రాష్ట్రాలకు ఇదే విషయాన్ని చెప్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో వ్యాక్సిన్‌ లభ్యత గణనీయంగా పెరగనుందని, కేంద్రప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్రాలకు 25శాతం, ప్రైవేటుకు 25శాతం వ్యాక్సిన్లను నేరుగా తయారీ సంస్థ నుంచి సేకరించుకోవచ్చని అన్నారు.

First Published:  28 May 2021 3:05 AM GMT
Next Story