Telugu Global
Cinema & Entertainment

కల్యాణ్ రామ్ మరో ప్రయోగం

ఇటు హీరోగా అటు నిర్మాతగా పలు ప్రయోగాత్మక సినిమాలు చేసిన నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు ‘బింబిసార’ అనే మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. వసిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. యుద్ధంలో శత్రువులను చంపి వారి శవాలపై ఠీవిగా కూర్చున్న బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ లుక్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు రేకెత్తిస్తుంది. కెరీర్ లో మొదటిసారి మైథలాజికల్ కథతో సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇది […]

కల్యాణ్ రామ్ మరో ప్రయోగం
X

ఇటు హీరోగా అటు నిర్మాతగా పలు ప్రయోగాత్మక సినిమాలు చేసిన నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు
‘బింబిసార’ అనే మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. వసిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు
సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

యుద్ధంలో శత్రువులను చంపి వారి శవాలపై ఠీవిగా కూర్చున్న బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ లుక్
అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు రేకెత్తిస్తుంది.

కెరీర్ లో మొదటిసారి మైథలాజికల్ కథతో సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇది హీరోగా అతనికి 18వ
సినిమా. గతేడాది షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.
ప్రస్తుతం కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ , లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ని వాయిదా వేశారు. త్వరలోనే మిగిలిన
భాగాన్ని చిత్రీకరించే ప్లానింగ్ లో ఉన్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా రాబోతోంది
బింబిసార.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై స్వయంగా కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో క్యాథరీన్, సంయుక్త మీనన్
హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతమందిస్తున్నాడు.

First Published:  28 May 2021 8:52 AM GMT
Next Story