Telugu Global
NEWS

ఏపీలో హెల్త్​హబ్​లు.. ! సీఎం జగన్​ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్​లో సరైన వైద్య సదుపాయాలు లేవన్న విషయం తెలిసిందే. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇటీవల కరోనా కేసులు పెరిగినప్పుడు ఏపీ ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తెలంగాణ బోర్డర్​ వద్ద అంబులెన్స్​లను కూడా ఆపేశారు. ఏపీలో వైద్యసదుపాయాలు ఎంత తక్కువగా ఉన్నాయో ఈ ఘటన అద్దం పట్టింది. ఇదిలా ఉంటే ఏపీలో ఆస్పత్రుల కొరత తీర్చేందుకు సీఎం జగన్​మోహన్​రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా 16 చోట్ల హెల్త్​హబ్​లు ఏర్పాటు […]

ఏపీలో హెల్త్​హబ్​లు.. ! సీఎం జగన్​ కీలక నిర్ణయం..!
X

ఆంధ్రప్రదేశ్​లో సరైన వైద్య సదుపాయాలు లేవన్న విషయం తెలిసిందే. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇటీవల కరోనా కేసులు పెరిగినప్పుడు ఏపీ ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తెలంగాణ బోర్డర్​ వద్ద అంబులెన్స్​లను కూడా ఆపేశారు. ఏపీలో వైద్యసదుపాయాలు ఎంత తక్కువగా ఉన్నాయో ఈ ఘటన అద్దం పట్టింది.

ఇదిలా ఉంటే ఏపీలో ఆస్పత్రుల కొరత తీర్చేందుకు సీఎం జగన్​మోహన్​రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా 16 చోట్ల హెల్త్​హబ్​లు ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రధాన నగరాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ హెల్త్​హబ్​లను ఏర్పాటు చేయనున్నారు.

ఇందుకోసం ఒక్కో హెల్త్​హబ్​కు 30 నుంచి 50 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ హెల్త్​ హబ్​ల వల్ల ఏపీకి ఎంతో ప్రయోజనం కలుగుతుందని .. 10 మల్టీ, సూపర్​స్పెషాలిటీ ఆస్పత్రులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్​లో 16 మెడికల్​, నర్సింగ్​ కళాశాలలు ఏర్పాటు చేయాలని కూడా సీఎం జగన్​ నిర్ణయం తీసుకున్నారు.

శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్​.. వైద్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యాక్సినేషన్​, ఆనందయ్య మందు పంపిణీ తదితర అంశాలను చర్చించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో ఆరోగ్యశ్రీ పథకం అద్భుతంగా అమలవుతున్నదని సీఎం జగన్​ చెప్పారు. ప్రైవేట్​ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కిందే కోవిడ్ వైద్యం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఏపీలో గత రెండ్రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్​వేవ్​ ఆరంభంలో ఆక్సిజన్​ కొరత వేధించింది. తిరుపతి రుయా ఆస్పత్రిల్లో ఆక్సిజన్​ అందక పలువురు ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు మెరుగైన వైద్యం కోసం కోవిడ్​ బాధితులు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు పరుగులు తీశారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్​ అయ్యింది. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టింది. అంతేకాక.. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న దోపిడీపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

First Published:  28 May 2021 11:44 AM GMT
Next Story