Telugu Global
NEWS

ఏ1గా రేవంత్​.. ఈడీ చార్జ్​షీట్​..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటుకేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసులో ఈడీ (ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​) తాజాగా చార్జ్​షీట్​ దాఖలు చేసింది. చార్జ్​షీట్​లో రేవంత్​రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్​, తదితరులపై అభియోగాలు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడిగా ఈడీ రేవంత్​రెడ్డిని పేర్కొన్నది. ఓటుకు నోటు కేసు రేవంత్​రెడ్డిని 2015 నుంచి నీడలా వెంటాడుతోంది. ఇది రాజకీయకుట్రతో పెట్టారని పలుమార్లు రేవంత్​ ఆరోపించారు. అయితే అప్పట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్​రెడ్డిని గెలిపించేందుకు […]

ఏ1గా రేవంత్​.. ఈడీ చార్జ్​షీట్​..!
X

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటుకేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ కేసులో ఈడీ (ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​) తాజాగా చార్జ్​షీట్​ దాఖలు చేసింది. చార్జ్​షీట్​లో రేవంత్​రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్​, తదితరులపై అభియోగాలు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడిగా ఈడీ రేవంత్​రెడ్డిని పేర్కొన్నది.

ఓటుకు నోటు కేసు రేవంత్​రెడ్డిని 2015 నుంచి నీడలా వెంటాడుతోంది. ఇది రాజకీయకుట్రతో పెట్టారని పలుమార్లు రేవంత్​ ఆరోపించారు. అయితే అప్పట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్​రెడ్డిని గెలిపించేందుకు రేవంత్​ రెడ్డి.. నామినేటెడ్​ ఎమ్మెల్యే స్టీఫెన్​సన్​కు రూ. 50 లక్షలు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా పలు టీవీ చానల్స్​లో టెలికాస్ట్​ అయ్యాయి.

ఈ కేసు వెనక మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. అప్పటినుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి .. ప్రత్యర్థులు చంద్రబాబును టార్గెట్​ చేస్తూ వచ్చారు. అయితే స్టీఫెన్​సన్​కు ఇచ్చిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న విషయంపై విచారణ జరుగుతోంది. తాజాగా ఈ కేసులో ఈడీ చార్జ్​షీట్​ దాఖలు చేసింది. రేవంత్​రెడ్డి.. ఓ ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చిన వీడియో అప్పట్లో సంచలనంగా మారింది.

ఈకేసులో రేవంత్​ రెడ్డి కొంతకాలం రిమాండ్​ ఖైదీగా జైలు జీవితం కూడా అనుభవించారు. తాజాగా ఈ కేసు మరోసారి తెరమీదకు రావడం గమనార్హం. అయితే అప్పట్లో చంద్రబాబుపైన కూడా ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే స్టీఫెన్​సన్ తో చంద్రబాబు ఫోన్​లో మాట్లాడినట్టు కూడా ఆడియో క్లిప్పింగులు బయటకువచ్చాయి. ఈ అంశాన్ని అప్పటి అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేత జగన్​ ప్రస్తావించారు.

ఓటుకు నోటు కేసు అప్పటి ఆంధ్రప్రదేశ్​ సీఎం చంద్రబాబునాయుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ మధ్య మాటల యుద్ధం తీసుకొచ్చింది. అప్పట్లో ఇద్దరు నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. చివరకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను వదిలేసి అమరావతి కేంద్రంగానే కార్యకలాపాలు చేసుకున్నారు.

First Published:  27 May 2021 10:50 AM GMT
Next Story