Telugu Global
Cinema & Entertainment

వెబ్ సైట్ పెట్టిన హీరోయిన్

హీరోయిన్లు తమ డబ్బును రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో పెట్టుబడులుగా పెడతారు. మరికొందరు సినిమాల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొందరు డ్రెస్ షోరూమ్స్ పెడతారు. కానీ హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రం వెబ్ సైట్ పెట్టింది. అయితే ఇదేదో వ్యాపారం కోసం పెట్టింది కాదు. సహాయం కోసం పెట్టిన వెబ్ సైట్. అవును.. అతి త్వరలో ఓ వెబ్ సైట్ పెట్టబోతోంది నిధి అగర్వాల్. కరోనాతో బాధపడుతున్న రోగులెవరైనా ఈ వెబ్ సైట్ లో తమ వివరాలు నమోదు […]

nidhi-agerwal-stills
X

హీరోయిన్లు తమ డబ్బును రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో పెట్టుబడులుగా పెడతారు. మరికొందరు
సినిమాల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొందరు డ్రెస్ షోరూమ్స్ పెడతారు. కానీ హీరోయిన్ నిధి అగర్వాల్
మాత్రం వెబ్ సైట్ పెట్టింది. అయితే ఇదేదో వ్యాపారం కోసం పెట్టింది కాదు. సహాయం కోసం పెట్టిన వెబ్
సైట్.

అవును.. అతి త్వరలో ఓ వెబ్ సైట్ పెట్టబోతోంది నిధి అగర్వాల్. కరోనాతో బాధపడుతున్న రోగులెవరైనా
ఈ వెబ్ సైట్ లో తమ వివరాలు నమోదు చేసుకొని, తమకు కావాల్సింది అడగొచ్చు. నిత్యావసరాలతో
పాటు మందులు, ఆక్సిజన్.. ఇలా ఏదైనా అడగొచ్చు.

ఈ అవసరాలు తీర్చేందుకు ఓ టీమ్ ను కూడా ఏర్పాటుచేసింది నిధి అగర్వాల్. వచ్చిన విన్నపాలకు
తగ్గట్టు ఈ టీమ్ వాళ్లకు కావాల్సినవి పంపిస్తుంది. అయితే ఏఏ రాష్ట్రాల్లో ఈ సేవల్ని అందుబాటులోకి
తీసుకురావాలనే అంశంపై నిధి ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాలతో పాటు
తమిళనాడులో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి

First Published:  26 May 2021 8:11 AM GMT
Next Story