Telugu Global
Health & Life Style

కంటిని కాపాడుకోండిలా..

రోజురోజుకీ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. అయితే ఇది అందరికీ సోకే అవకాశం తక్కువే.. అలాగే కొన్ని జాగ్రత్తల ద్వారా దీన్ని రాకుండా కాపాడుకోవచ్చు. అవేంటంటే.. – బ్లాక్ ఫంగస్ ముందుగా కంటిపై దాడి చేస్తుంది. అందుకే కంటికి మేలు చేసే ఆహారం తీసుకోవడం ద్వారా బ్లాక్ ఫంగస్ ద్వారా కళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవచ్చు. – కంటికి మేలు చేసే వాటిలో ఒమేగా3 ఫ్యాటీ […]

కంటిని కాపాడుకోండిలా..
X

రోజురోజుకీ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. అయితే ఇది అందరికీ సోకే అవకాశం తక్కువే.. అలాగే కొన్ని జాగ్రత్తల ద్వారా దీన్ని రాకుండా కాపాడుకోవచ్చు. అవేంటంటే..

– బ్లాక్ ఫంగస్ ముందుగా కంటిపై దాడి చేస్తుంది. అందుకే కంటికి మేలు చేసే ఆహారం తీసుకోవడం ద్వారా బ్లాక్ ఫంగస్ ద్వారా కళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవచ్చు.
– కంటికి మేలు చేసే వాటిలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ముందు వరుసలో ఉంటాయి. ఇవి చేపలు, అవిశె గింజలు, సబ్జా గింజల్లో ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ తీసుకుంటూ ఉండాలి.
– ఆకుకూరలు, సిట్రస్ ఫ్రూట్స్ కూడా కంటిని కాపాడతాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటిలోని కణాలకు రక్షణ కల్పించి, కంటికి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
– వీటితో పాటు జింక్‌ కూడా కంటిని రక్షిస్తుంది. కంటి చూపును దెబ్బతినకుండా ఉండాలంటే జింక్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి.

ఇకపోతే క్యారెట్, బీట్ రూట్, మునగాకు లాంటి విటమిన్ ఏ ఫుడ్స్ కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్ తినాలి. – నారింజ, బత్తాయి, నిమ్మ, పనస లాంటి పండ్లలో సి విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫంగస్‌లు, బ్యాక్టీరియాలు రాకుండా అడ్డుకుంటుంది.ఇక వీటితో పాటు- బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌ కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. బ్లాక్ ఫంగస్ ఎటాక్ చేయడానికి మొదటి అవకాశం మన ఇమ్యూనిటీ వీక్ గా ఉండడమే. అసలే తక్కువ ఇమ్యూనిటీ ఉన్న వాళ్లకు కోవిడ్ సోకినప్పుడు ఉన్న కాస్త ఇమ్యూనిటీ దెబ్బతినడంతో.. బ్లాక్ ఫంగస్ ఎటాక్ చేస్తుంది. అందుకే ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు పోషకాలు, విటమిన్లు తింటూ ఉండాలి.

First Published:  26 May 2021 4:12 AM GMT
Next Story