Telugu Global
Business

గూగుల్ నుంచి సర్‌‌ప్రైజింగ్ అప్‌డేట్స్

యూజర్స్ కు కొత్త ఎక్స్ పీరియెన్స్ ను అందించడంలో గూగుల్ ముందుంటుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్స్ తెస్తూ.. సర్ ప్రైజ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే గూగుల్ ఈ ఏడాది చివరికల్లా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ తీసుకురానుంది. అవేంటంటే.. రూట్‌‌ సేఫ్ గా.. గూగుల్‌‌ మ్యాప్స్‌‌లో మనకు కేవలం డెస్టినేషన్ కు వెళ్లే రూట్ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ రూట్ ఎంతవరకూ సేఫ్ అన్న సంగతి మనకు తెలియదు. అయితే ఇప్పుడు […]

గూగుల్ నుంచి సర్‌‌ప్రైజింగ్ అప్‌డేట్స్
X

యూజర్స్ కు కొత్త ఎక్స్ పీరియెన్స్ ను అందించడంలో గూగుల్ ముందుంటుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్స్ తెస్తూ.. సర్ ప్రైజ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే గూగుల్ ఈ ఏడాది చివరికల్లా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ తీసుకురానుంది. అవేంటంటే..

రూట్‌‌ సేఫ్ గా..
గూగుల్‌‌ మ్యాప్స్‌‌లో మనకు కేవలం డెస్టినేషన్ కు వెళ్లే రూట్ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ రూట్ ఎంతవరకూ సేఫ్ అన్న సంగతి మనకు తెలియదు. అయితే ఇప్పుడు రాబోతున్న గూగుల్ సేఫ్‌‌ రూట్‌ ఫీచర్‌ తో సురక్షితమైన రూట్‌‌ను ఎంచుకోవచ్చు. అంటే యాక్సిడెంట్స్‌‌ తక్కువగా జరిగే రూట్స్, అలాగే రెస్టారెంట్స్ లాంటివి ఎక్కువగా ఉండే రూట్స్ ను సజెస్ట్ చేస్తుందన్న మాట.

పాస్‌‌వర్డ్‌ హెల్ప్‌
గూగుల్‌ అకౌంట్స్ కు సంబంధించి ఏదైనా పాస్‌‌వర్డ్స్‌‌ లీకైతే మన మొబైల్ నుంచి మన బ్యాంకింగ్ డేటా వరకూ అన్నీ హ్యాకింగ్‌‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎప్పుడైనా పాస్ వర్డ్ కు సంబంధించి హ్యాకింగ్ సూచనలొస్తే.. వెంటనే పాస్‌‌వర్డ్‌‌ చేంజ్‌ అలర్ట్స్‌‌ వస్తాయి. అలాగే స్ట్రాంగ్ పాస్‌‌వర్డ్స్‌‌ క్రియేట్‌‌ చేసుకునేలా కూడా హెల్ప్ చేస్తుంది.

ఫొటో‌ మూమెంట్స్‌‌
స్టిల్ ఇమేజ్ ను వీడియోగా మారిస్తే ఎలా ఉంటుంది. చాలా కొత్తగా ఉంటుంది కదూ.. ఇప్పుడు రాబోతున్న గూగుల్ కొత్త ఫీచర్ కూడా అదే. గూగుల్ ఫొటోస్ లో ఉన్న స్టిల్‌‌ ఫొటోస్‌‌ను యానిమేటెడ్‌‌ ఫొటోస్‌‌గా మార్చుకోవచ్చు. ఈ ఫీచర్‌‌‌‌ ద్వారా రెండు మూడు స్టిల్స్‌‌ కూడా కలిపి యానిమేటెడ్‌‌ వీడియోలాగా మార్చుకోవచ్చు.

లెన్స్ తో షాపింగ్
ఫోన్ లో అవీ ఇవీ స్క్రోల్ చేస్తున్నప్పుడు అప్పుడడప్పుడు మనకు కావాల్సిన వస్తువులు లేదా గ్యాడ్జెట్స్ లాంటివి కనిపిస్తుంటాయి. అయితే వాటిని ఎక్కడ ఎలా పొందాలో మనకు తెలీదు. ఇప్పుడు గూగుల్ లో రాబోతున్న ఈ ఫీచర్ ద్వారా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏదైనా వస్తువు మనకు కావాలనుకుంటే దానిని స్క్రీన్ షాట్ తీసి గూగుల్ లెన్స్ ద్వారా వెతికితే చాలు. అది ఏ వెబ్ సైట్ లో లేదా ఏ స్టోర్ లో దొరుకుతుందో చెప్పేస్తుంది. ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నా చూపిస్తుంది. షాపింగ్ ప్రియులకు బాగా నచ్చే ఫీచర్ ఇది.

డిజిటల్‌‌ కార్‌‌‌‌ కీ
ఇప్పుడు చాలా కార్స్ కు ఆండ్రాయిడ్‌‌ ఆటో–ఎనేబుల్డ్‌‌ ఫీచర్ ఉంటుంది. అలాంటి కనెక్టివిటీ ఉన్న కార్స్ ను ఇకపై ‌స్మార్ట్‌‌ఫోన్‌‌ తోనే లాక్‌‌, అన్‌‌లాక్‌‌ లేదా స్టార్ట్‌‌ చేయొచ్చు. అయితే ఈ ఫీచర్ మొదటగా ఆండ్రాయిడ్‌‌ 12 ఓఎస్‌‌ వెర్షన్‌‌ ఫోన్లలోనే‌‌‌ పనిచేస్తుంది. ముందుముందు అన్ని వెర్షన్స్ కు అందుబాటులోకి రానుంది.

First Published:  24 May 2021 4:33 AM GMT
Next Story