Telugu Global
Health & Life Style

వ్యాక్సిన్.. క‌రోనా కొత్త వేరియంట్ల‌పై కూడా బాగా ప‌నిచేస్తుందంటున్న బ్రిట‌న్‌ శాస్త్రజ్ఞులు

కరోనా కొత్త వేరియంట్లపై బ్రిటన్ లో పంపిణీ చేస్తున్న బయోఎన్ టెక్(ఫైజర్), ఆక్స్ ఫర్డ్(ఆస్ట్రాజెనెకా) టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈశాన్య ఇంగ్లండ్ లో బయటపడిన కెంట్ వేరియంట్ (B.1.1.7)పై ఫైజర్ టీకా 93శాతం ప్రభావ వంతంగా పనిచేస్తుందని, ఇటీవల భారత్ సహా మరికొన్ని దేశాల్ని చుట్టుముట్టిన B.1.617.2 వేరియంట్ ని ఇదే టీకా 88శాతం సమర్థంగా అడ్డుకుంటుందని తెలిపారు. ఇక ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా టీకా కెంట్ వేరియంట్ ని 66 శాతం […]

వ్యాక్సిన్.. క‌రోనా కొత్త వేరియంట్ల‌పై కూడా బాగా ప‌నిచేస్తుందంటున్న బ్రిట‌న్‌ శాస్త్రజ్ఞులు
X

కరోనా కొత్త వేరియంట్లపై బ్రిటన్ లో పంపిణీ చేస్తున్న బయోఎన్ టెక్(ఫైజర్), ఆక్స్ ఫర్డ్(ఆస్ట్రాజెనెకా) టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈశాన్య ఇంగ్లండ్ లో బయటపడిన కెంట్ వేరియంట్ (B.1.1.7)పై ఫైజర్ టీకా 93శాతం ప్రభావ వంతంగా పనిచేస్తుందని, ఇటీవల భారత్ సహా మరికొన్ని దేశాల్ని చుట్టుముట్టిన B.1.617.2 వేరియంట్ ని ఇదే టీకా 88శాతం సమర్థంగా అడ్డుకుంటుందని తెలిపారు.

ఇక ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా టీకా కెంట్ వేరియంట్ ని 66 శాతం సమర్థంగా అడ్డుకుంటుందని, B.1.617.2 వేరియంట్ ని కూడా 60శాతం అడ్డుకుంటుందని తెలిపారు. ఎంత శాతం అనే విషయాన్ని పక్కనపెడితే.. కొత్త వేరియంట్ ని సమర్థంగా అడ్డుకోవడంలో రెండు టీకాలు అంచనాలకు మించి ఫలితాలనిచ్చాయని మాత్రం అక్కడి అధికారులు చెబుతున్నారు. దీంతో బ్రిటన్ లో కొత్త వేరియంట్లపై భయం పోయింది. అయితే రెండు డోసులు తీసుకున్నవారిలోనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, టీకా ప్రభావం బాగుంటుందని తెలిపారు.

B.1.617.2 వేరియంట్ తో భయం.. భయం..
ఇండియా వేరియంట్ అంటూ B.1.617.2 టైప్ వైరస్ ని పిలవొద్దని భారత ప్రభుత్వం స్పష్టం చేసినా.. ఇతర దేశాల మీడియాలో మాత్రం దీన్నింకా భారత్ పేరుతో ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారు. ఈరకం వైరస్ బ్రిటన్ లో అడుగుపెట్టిందని ఇటీవల అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. లాక్ డౌన్ నియమాలను కఠినతరం చేసింది. బ్రిటన్ లో 2889మందికి ఇలాంటి వైరస్ సోకగా.. 104మంది ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని, వారిలో 31మందికి సీరియస్ అయిందని, అందులో ఆరుగురు చనిపోయారని తెలుస్తోంది. అంటే బ్రిటన్ లో వ్యాక్సినేషన్ వల్ల ఈ వేరియంట్ ప్రభావం ఎక్కువగా కనిపించలేదని అర్థమవుతోంది. లండన్ నగరం పరిసర ప్రాంతాల్లో కెంట్ వేరియంట్ తోపాటు, కొత్త వేరియంట్ రెండూ.. ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఇంగ్లండ్ లోని మిగతా ప్రాంతాల్లో మాత్రం B.1.617.2 మాత్రమే ఎక్కువగా వ్యాపిస్తోంది.

వైరస్ వ్యాప్తి పెరిగినా మరణాల సంఖ్య తక్కువగా ఉండటం, టీకా రెండు డోసులు వేసుకున్నవారిపై ప్రభావం లేకపోవడం బ్రిటన్ వాసులకు ధైర్యాన్నిచ్చే అంశం. ఇదే పరిస్థితి కొనసాగితే.. జూన్ 21 తో బ్రిటన్ లో లాక్ డౌన్ ఎత్తేస్తారని అంచనా వేస్తున్నారు.

First Published:  23 May 2021 1:43 AM GMT
Next Story