Telugu Global
National

భారత్ కోలుకుంటోందా?

గత కొంతకాలంగా గణాంకాలు చూస్తుంటే సెకండ్‌ వేవ్‌ ఉధృతి మెల్లగా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. వరుసగా 9వ రోజూ కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటున్నాయి. వేవ్ తగ్గుతున్నట్టు నిర్థారించాలంటే మొదటగా టెస్టుల్లో పాజిటివిటీ రేటు తగ్గాలి. ఆ తర్వాత ఆసుపత్రుల్లో సీరియస్‌ కేసుల అడ్మిషన్లు తగ్గాలి. అలాగే మరణాలు కూడా తగ్గుముఖం పట్టాలి. అయితే ప్రస్తుతం దేశంలో మొదటి దశ కాస్త కనిపిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు. యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తంగా […]

భారత్ కోలుకుంటోందా?
X

గత కొంతకాలంగా గణాంకాలు చూస్తుంటే సెకండ్‌ వేవ్‌ ఉధృతి మెల్లగా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. వరుసగా 9వ రోజూ కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటున్నాయి. వేవ్ తగ్గుతున్నట్టు నిర్థారించాలంటే మొదటగా టెస్టుల్లో పాజిటివిటీ రేటు తగ్గాలి. ఆ తర్వాత ఆసుపత్రుల్లో సీరియస్‌ కేసుల అడ్మిషన్లు తగ్గాలి. అలాగే మరణాలు కూడా తగ్గుముఖం పట్టాలి. అయితే ప్రస్తుతం దేశంలో మొదటి దశ కాస్త కనిపిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు.

యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తంగా జూలై నాటికి సెకండ్ వేవ్ కాస్త కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణుల అంచనా. యాక్టివ్ కేసులు మూడు లక్షలకు దిగువన ఉండటం ఇది ఆరో రోజు. ఏప్రిల్‌ 28 తర్వాత ఇవే అత్యల్పమైన గణాంకాలు. ఇకపోతే మరో పక్క చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలవుతోంది. చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఈ నెలాఖరి వరకూ పొడిగించాయి. అవసరమైతే జూన్ లో కూడా లాక్ డౌన్ కొనసాగించే అవకాశం ఉంది.

ఢిల్లీతో సహా చాలా రాష్ట్రాల్లో పాజిటివ్‌ రేటు మెల్లగా తగ్గుతోంది. 12 రోజుల్లో పాజిటివిటీ సగానికి తగ్గినట్టు తెలుస్తోంది. దేశంలో చాలా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి మెల్లగా నెమ్మదిస్తోందని, ఈ నెల 10న 24.83గా ఉన్న పాజిటివిటీ రేటు శనివారం నాటికి 12.45కు తగ్గిందని కేంద్రం తెలిపింది. ఈ సమయంలోనే వ్యాక్సినేషన్ కూడా మొదలైతే, అందరికీ వ్యాక్సిన్స్ ఇవ్వగలిగితే మూడో వేవ్ లాంటి మరో ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  23 May 2021 3:20 AM GMT
Next Story