Telugu Global
Health & Life Style

కోవిడ్ కు కొత్త మందులు..

కోవిడ్‌ కు కొత్త కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి. రానురానూ కోవిడ్ తీవ్రత పెరుగుతుండడంతో కొత్త మందులకు డిమాండ్ పెరుగుతుంది. అలాగే వాటిపై జరిగే పరిశోధనలు కూడా వేగవంతం అవుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో జంతువులు, మనుషులపై రెండు స్టేజీల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకున్న ‘మోల్నుఫిరావిర్‌–400ఎంజీ’ అనే మెడిసిన్ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సిద్ధమైంది. అయితే ఈ మూడో స్టేజీ ట్రయల్స్ మన హైదరాబాద్‌ లోని యశోద ఆస్పత్రిలో జరగబోతుండడం విశేషం. నాట్కో ఫార్మాతో […]

కోవిడ్ కు కొత్త మందులు..
X

కోవిడ్‌ కు కొత్త కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి. రానురానూ కోవిడ్ తీవ్రత పెరుగుతుండడంతో కొత్త మందులకు డిమాండ్ పెరుగుతుంది. అలాగే వాటిపై జరిగే పరిశోధనలు కూడా వేగవంతం అవుతున్నాయి.

అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో జంతువులు, మనుషులపై రెండు స్టేజీల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకున్న ‘మోల్నుఫిరావిర్‌–400ఎంజీ’ అనే మెడిసిన్ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సిద్ధమైంది. అయితే ఈ మూడో స్టేజీ ట్రయల్స్ మన హైదరాబాద్‌ లోని యశోద ఆస్పత్రిలో జరగబోతుండడం విశేషం.

నాట్కో ఫార్మాతో కలసి యశోద ఆస్పత్రిలో ఈ మెడిసిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన రెండు దశల్లో ఎలాంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాలు వచ్చాయని డాక్టర్లు చెప్తున్నారు.

కరోనా బారిన పడి మైల్డ్‌ సింప్టమ్స్‌తో బాధపడుతున్న వివిధ వయసుల వాళ్లను ఎంపిక చేసుకుని వారిపై పరిశోధన జరిపారు. ఐదు రోజుల పాటు ఈ మందులు వాడి, ఆ తర్వాతి రోజు టెస్టు చేయగా, నెగెటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు. మూడో దశ ట్రయల్స్ పూర్తికాగానే మరో దశ మిగిలి ఉందని తర్వాత మెడిసిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని డాక్టర్లు చెప్తున్నారు.

నెల్లూరులో ఆయుర్వేద మందు
నెల్లూరు జిల్లా కృష్టపట్నం లో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు ఇస్తున్న కరోనా మందుకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. మొదట్లో ఈ మందు కృష్ణపట్నం పరిసర గ్రామాలకే పరిమితమైంది. సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య పెరగడంతో ఇక్కడికొచ్చే పేషెంట్లు పెరిగారు. పైగా సీరియస్‌గా ఉన్న పేషెంట్లు సైతం ఈ మందు వాడి కోలుకోవడంతో ఆనందయ్య ఆయుర్వేద మందు పేరు మారు మోగింది. దీంతో ఇప్పుడు జనం వేల సంఖ్యలో ఆయన వద్దకు వెళ్తున్నారు.

జనం వేల సంఖ్యలో ఆ మందు కోసం ఆరాటపడుతుండటంతో ప్రభుత్వం స్థానిక అధికార యంత్రాంగంతో ఆ మందుపై నివేదిక తెప్పించుకొని దానికి అధికారికంగా అనుమతినిచ్చింది. ఈ మందు తీసుకున్నాక కరోనా నుంచి కోలుకున్నామని, శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయని మందు తీసుకున్న పేషెంట్లు చెప్తున్నారు.

First Published:  22 May 2021 3:28 AM GMT
Next Story