Telugu Global
National

ఆగస్ట్ నుంచి భారత్ లో స్పుత్నిక్ టీకా తయారీ..

భారత్ లో స్పుత్నిక్-వి టీకా పంపిణీ లాంఛనంగా మొదలైంది. అపోలో ఆస్పత్రుల భాగస్వామ్యంతో ఈ టీకా పంపిణీ చేస్తోంది డాక్టర్ రెడ్డీస్ సంస్థ. అయితే ప్రస్తుతానికి దిగుమతి చేసుకున్న టీకానే వినియోగిస్తున్నారు. భారత్ లో టీకా తయారీని జూన్ నుంచి మొదలు పెట్టబోతున్నట్టు గతంలో ప్రకటించినా ఇప్పుడది మరో రెండు నెలలు వాయిదా పడింది. దీనికి సంబంధించి రష్యాలో భారత రాయబారి డీబీ వెంకటేష్ వర్మ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆగస్ట్ వరకు దిగుమతులే.. ఇప్పటి […]

ఆగస్ట్ నుంచి భారత్ లో స్పుత్నిక్ టీకా తయారీ..
X

భారత్ లో స్పుత్నిక్-వి టీకా పంపిణీ లాంఛనంగా మొదలైంది. అపోలో ఆస్పత్రుల భాగస్వామ్యంతో ఈ టీకా పంపిణీ చేస్తోంది డాక్టర్ రెడ్డీస్ సంస్థ. అయితే ప్రస్తుతానికి దిగుమతి చేసుకున్న టీకానే వినియోగిస్తున్నారు. భారత్ లో టీకా తయారీని జూన్ నుంచి మొదలు పెట్టబోతున్నట్టు గతంలో ప్రకటించినా ఇప్పుడది మరో రెండు నెలలు వాయిదా పడింది. దీనికి సంబంధించి రష్యాలో భారత రాయబారి డీబీ వెంకటేష్ వర్మ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఆగస్ట్ వరకు దిగుమతులే..
ఇప్పటి వరకూ తొలి విడత లక్షన్నర స్పుత్నిక్-వి టీకా డోసుల్ని డాక్టర్ రెడ్డీస్ సంస్థ దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత రెండో విడతలో 60వేల టీకాలు తెప్పించారు. మే చివరి నాటికి 30లక్షల స్పుత్నిక్‌-వి డోసులు భారత్‌ కు వస్తాయి. వచ్చే నెలలో నాలుగో విడతగా మరో 50లక్షల డోసులు రష్యానుంచి దిగుమతి అవుతాయని వెంకటేష్ వర్మ తెలిపారు.

మూడు దశల్లో..
ఇప్పటి వరకు రష్యానుంచి వచ్చిన టీకాలన్నీ నేరుగా వినియోగానికి సిద్దంగా ఉన్నవే. దీన్ని తొలిదశగా భావిస్తున్నారు. రెండో దశలో వ్యాక్సిన్ ని బాటిల్స్ లో నింపకుండా బల్క్ గా పంపిస్తారు. దీన్ని కూడా నేరుగా వినియోగించుకోవచ్చు కానీ, బల్క్ గా వచ్చే వ్యాక్సిన్ ని ఇక్కడ బాటిళ్లలో నింపి నిల్వచేసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడోదశలో వ్యాక్సిన్ తయారీ, పంపిణీ అంతా భారత్ లోనే ఉంటుంది. రష్యా కంపెనీ కేవలం టీకా టెక్నాలజీని మాత్రమే భారత్ తో పంచుకుంటుంది. ప్రస్తుతమున్న ప్రణాళిక ప్రకారం.. మొత్తం 85కోట్ల డోసుల స్పుత్నిక్‌-వి టీకాలను భారత్‌ కు అందించబోతున్నట్టు వెంకటేష్ వర్మ తెలిపారు.

రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా ఇన్‌ స్టిట్యూట్‌ ఈ టీకాను అభివృద్ధి చేసింది. భారత్ లో టీకా ఒక్కో డోసు ధర రూ. 995.40 గా నిర్ణయించారు. త్వరలో స్పుత్నిక్ లైట్ అనే సింగిల్ డోస్ టీకాను కూడా భారత్ లో వినియోగించే అవకాశం ఉంది.

First Published:  22 May 2021 4:15 AM GMT
Next Story